2018 ఇయర్ సెకెండ్ ఆఫ్ లో అత్యంత భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా.
ఈ సినిమా పక్కా మాస్ మసాలా కమర్షియల్ మూవీ అన్న విషయం ఫస్ట్ లుక్ తోనే తెలిసిపోయింది. కాగా ఓవర్సీస్ లో సినిమా ఫైనల్ రేటు ఏంటో ఆల్ మోస్ట్ కన్ఫాం అయిందని తెలుస్తుంది. సుమారు 13 కోట్ల రేటు ఆఫర్ చేసి సినిమా హక్కులను LA Telugu వారు సొంతం చేసుకున్నారట. దాంతో కమర్షియల్ సినిమాలలో ఈ రేంజ్ లో రేటు దక్కించుకున్న అతి తక్కువ సినిమాల్లో ఒకటిగా చేరబోతోంది ఈ సినిమా.