టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ అరవింద సమేత వచ్చి ఏడాదికి పైగా సమయం అవుతుంది, కాగా ఇంకో ఏడాది వరకు ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా లేదు, రామ్ చరణ్ తో కలిసి నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈ ఇయర్ లో రిలీజ్ అనుకున్నా పోస్ట్ పోన్ అయ్యి వచ్చే ఇయర్ సంక్రాంతి కానుకగా…
రిలీజ్ అవుతుందని అప్ డేట్ చేయడం తో ఫ్యాన్స్ మరింత నిరాశ లో ఉండగా ఎన్టీఆర్ ఆ సినిమా పూర్తీ చేసి మళ్ళీ కొత్త సినిమా మొదలు పెట్టి ఎప్పుడు రిలీజ్ చేయాలి అని ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్న టైం లో ఫ్యాన్స్ కి డబుల్ బొనంజా ప్రకటించాడు ఎన్టీఆర్.
ఆర్ ఆర్ ఆర్ ఎలాగూ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా 2021 సమ్మర్ కానుకగా తన 30 వ సినిమాను రిలీజ్ చేయబోతున్నారట. ఈ సినిమా తనకి అరవింద సమేత తో కెరీర్ బెస్ట్ ఇచ్చిన త్రివిక్రమ్ డైరెక్షన్ లో హారికా హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్ మే లో మొదలు అవుతుందని సమాచారం. సమ్మర్ కానుకగా 2021 లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పొలిటికల్ నేపధ్యంలో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో కూడుకుని ఉన్న కథ తో తెరకేక్కే బోతుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇక సినిమా కోసం…
హారికా హాసిని వారు ఇప్పటికే “అయిననూ పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఊపులో ఉన్న త్రివిక్రమ్, నాన్ స్టాప్ గా ఫ్లాఫ్స్ లేకుండా దూసుకుపోతున్న ఎన్టీఆర్, అందునా మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత సమ్మర్ రేసులో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషనల్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి ఇక….