Home న్యూస్ టాప్ స్టార్ మూవీ…బజ్ లేదు…అయినా వీర లెవల్ కుమ్ముడు ఇది!!

టాప్ స్టార్ మూవీ…బజ్ లేదు…అయినా వీర లెవల్ కుమ్ముడు ఇది!!

0

కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన సినిమాలు రీసెంట్ టైంలో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయడం లేదు….మరో పక్క దళపతి విజయ్(Thalapathy Vijay) టాప్ ప్లేస్ లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతున్నాడు. అజిత్ నుండి వస్తున్న సినిమాలు కూడా…

అనుకున్న రేంజ్ లో బజ్ ను అయితే సొంతం చేసుకోలేక పోతున్నాయి…లేటెస్ట్ గా అజిత్ నుండి ఆడియన్స్ ముందుకు విదాముయ‌ర్చి(Vidaamuyarchi) మూవీ ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా తెలుగు లో పట్టుదల పేరుతో డబ్ అయ్యి రిలీజ్ కానుంది.

సినిమా ట్రైలర్ కానీ అనిరుద్ పాటలు కానీ మీడియోకోర్ గానే ఉండగా ఒక టాప్ స్టార్ మూవీ కి ఉండాల్సిన రేంజ్ లో అయితే బజ్ ఇప్పటి వరకు రాలేదు అనే చెప్పాలి. కానీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను తమిళనాడు లో రీసెంట్ గా ఓపెన్ చేశారు….

మిడ్ నైట్ టైంలో గంటకి 15 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ తో ఈ సినిమా ఒక్కసారిగా అందరినీ ఆశ్యర్యపరిచే టికెట్ సేల్స్ తో షాకిచ్చింది….ఓవరాల్ గా కొన్ని గంటల వ్యవధిలోనే 2 కోట్ల వర్త్ గ్రాస్ బుకింగ్స్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఈ సినిమా….

అసలు పెద్దగా బజ్ ఏమి లేని సినిమాకే ఇలాంటి రెస్పాన్స్ అంటే మంచి కాంబో లో హైప్ కానీ వస్తే అజిత్ కుమార్ స్టార్ పవర్ చూపెడుతూ ఏ రేంజ్ లో రచ్చ చేసేవాడో అని అందరూ అనుకుంటున్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లో ఊహించని విధంగా…

రిమార్కబుల్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న పట్టుదల మూవీ ఇదే ఊపు ని కొనసాగించి ఓపెనింగ్ డే లో టాక్ డీసెంట్ గా వచ్చినా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here