Home న్యూస్ రామ్ కెరీర్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ రేటు కొట్టిన #RAPO19!!

రామ్ కెరీర్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ రేటు కొట్టిన #RAPO19!!

1376
0

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకోగా ఆ సినిమా తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి సత్తా చాటుకుంది. తర్వాత చేసిన తమిళ్ బ్లాక్ బస్టర్ తడం తెలుగు రీమేక్ రెడ్ మూవీ అనుకున్న రేంజ్ లో లేకున్నా కానీ…

RED The Film 1st Day Total Worldwide Collections!

సంక్రాంతి అడ్వాంటేజ్ తో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక బాక్ టు బాక్ సూపర్ హిట్స్ మూవీస్ తో దుమ్ము లేపిన రామ్ ఇప్పుడు తెలుగు మరియు తమిళ్ లో కలిపి చేస్తున్న బైలింగువల్ మూవీ లింగుస్వామి డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.

RED The Film 2 Days Total Worldwide Collections!

ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటి నుండే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో విలన్ రోల్ లో సరైనోడు లో అదరగొట్టిన ఆది పినిశెట్టి నటిస్తుండగా హీరో విలన్ ల మధ్య పోటి అదిరి పోతుందని, సినిమా పందెం కోడి తరహా కథని డిఫెరెంట్ యాంగిల్ లో…

లింగుస్వామి తెరకెక్కిస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇక ఈ సినిమా కి సంబంధించిన బిజినెస్ డీల్ ఆల్ రెడీ మొదలు అవ్వడం విశేషం, రీసెంట్ గా సినిమా మ్యూజిక్ రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి అమ్మగా సెన్సేషన్ రేటు ను సొంతం చేసుకుందట ఈ సినిమా. రామ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ లెవల్ లో ఏకంగా 2.75 కోట్ల రేటు ని..

ఈ సినిమా తెలుగు తమిళ్ కలిపి సొంతం చేసుకుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇది ఆల్ మోస్ట్ బిగ్ స్టార్స్ క్రేజీ కాంబినేషన్ లో సొంతం అయ్యే రేంజ్ రేటు అని చెప్పాలి. సినిమా సినిమా కి తన రేంజ్ ని ఇంకా పెంచుకుంటున్న రామ్ ఈ సినిమా కరెక్ట్ గా వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉంది.

RED The Film 5 Days Total Worldwide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here