నాచురల్ స్టార్ నాని రితు వర్మ ల కాంబినేషన్ లో శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అయ్యి రచ్చ చేయాల్సింది కానీ ఊరించి ఊరించి ఫైనల్ గా థియేట్రికల్ రిలీజ్ కాదని సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో చేయగా సినిమా ఫ్యామిలీ మూవీస్ నచ్చే వాళ్ళకి….
నచ్చినప్పటికీ కూడా రెగ్యులర్ మూవీ గోర్స్ కి మాత్రం చాలా బోర్ మూవీ గా డిక్లేర్ చేసి సోషల్ మీడియా లో సినిమా పై విపరీతమైన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ స్ప్రెడ్ అవ్వడం తో ఇప్పుడు ఆ ఇంపాక్ట్ సినిమా అమెజాన్ ప్రైమ్ వ్యూవర్ షిప్ పై గట్టిగా పడింది అంటున్నారు..
అమెజాన్ ప్రైమ్ వాళ్ళు టాప్ మూవీస్ వ్యూవర్ షిప్ వివరాలు ప్రతీ నెల ఎండ్ టైం లో రిలీజ్ చేస్తుంటారు కానీ ఇప్పుడు సినిమా వీకెండ్ రిపోర్ట్స్ ని మేకర్స్ తో షేర్ చేసుకున్నట్లు ఆ వివరాలు కొన్ని లీక్ అయ్యాయి. ఆ లీక్ అయిన వార్తల ప్రకారం….
సినిమా మొదటి వీకెండ్ వ్యూవర్ షిప్ కి విపరీతంగా స్ప్రెడ్ అయిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ వలన భారీ ఇంపాక్ట్ ని చూపింది అంటున్నారు… హిట్ టాక్ ఉంటే ప్రైమ్ అకౌంట్ లేని వాళ్ళు కూడా ఒక నెల కోసం అయినా సబ్ స్క్రిప్షన్ ని తీసుకుని చూస్తారు, అదే ఫ్లాఫ్ టాక్ వస్తే పైరసీనే ఎక్కువగా చూస్తారు… ఇప్పుడు అదే జరగడం తో సినిమా వ్యూవర్ షిప్…
ఇది వరకు తెలుగు లో డైరెక్ట్ రిలీజ్ అయిన నారప్ప వి ది మూవీ లతో పోల్చితే చాలా తక్కువ వచ్చాయని అంటున్నారట… సినిమాను కండీషన్ మీద 37 కోట్ల రేటు కి కొన్న ప్రైమ్ వాళ్ళకి ఇప్పుడు రికవరీ అవ్వడం కష్టంగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి… కానీ అగ్రిమెంట్స్ ఆల్ రెడీ జరిగి పోయాయి కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అంటున్నారు..