Home న్యూస్ టక్ జగదీష్ ట్రైలర్ రివ్యూ…కుమ్మింది ట్రైలర్!

టక్ జగదీష్ ట్రైలర్ రివ్యూ…కుమ్మింది ట్రైలర్!

605
0

నాచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ మాస్ మూవీ టక్ జగదీష్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమాను థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అవ్వగా ప్రైమ్ వీడియో లో ఈ సినిమాను ఈ నెల 10 న రిలీజ్ చేయబోతుండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు… యూట్యూబ్ లో కాకుండా ముందు ఇన్స్ట గ్రామ్ లో రిలీజ్ చేశారు…

దాంతో యూట్యూబ్ రిలీజ్ కొంచం ఆలస్యం అవ్వగా ఓవరాల్ గా ట్రైలర్ మాస్ కట్ బాగా మెప్పించింది అని చెప్పాలి. ఒక ఊరు, ఆ ఊరిలో భూములను దోచుకునే ఒక విలన్, వాళ్ళని అడ్డుకోవడానికి ట్రై చేసే హీరో ఫ్యామిలీ.. హీరో అన్న జగపతిబాబు కి తల్లికి పడదు.

ఊరి గొడవల్లో హీరో ఫాదర్ చనిపోతాడు… తర్వాత ఏం జరిగింది… విలన్ ల భారీ నుండి ఊరిని హీరో ఎలా కాపాడాడు, ఇక ఫ్యామిలీలో వచ్చిన మనస్పర్ధలను హీరో ఒక్కోటిగా ఎలా సెట్ చేశాడు అన్న కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే టక్ జగదీష్ సినిమా…

ట్రైలర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ టీసర్ రేంజ్ లో అయితే మెప్పించలేదు… అన్ని క్యారెక్టర్స్ కి స్కోప్ ఇస్తూ ట్రైలర్ కట్ ని బాగానే కట్ చేయగా నాని చెల్లి రోల్ లో ఐశ్వర్య రాజేష్ ఆకట్టుకోగా, ఊరి VRO గా హీరోయిన్ రితు వర్మ ఆకట్టుకుంది…నానికి అన్నగా జగపతిబాబు కూడా మంచి రోల్ లో కనిపించబోతున్నట్లు ట్రైలర్ లో క్లియర్ అయింది. ఓవరాల్ గా నాని నుండి మాస్ మూవీ వచ్చి చాలా టైం అవ్వగా…

ఈ సినిమా కచ్చితంగా మాస్ ని ఓ రేంజ్ లో అలరించే విధంగా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను బాగానే పెంచింది అని చెప్పాలి. ఇక ట్రైలర్ యూట్యూబ్ లో మొదటి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తి గా మారింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here