టాలీవుడ్ లో రీసెంట్ టైం లో సినిమాల బిజినెస్ తో పాటు శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా భారీ ఎత్తున డబ్బు నిర్మాతలకు వెళుతుంది, దాంతో బడ్జెట్ సమస్యలు లేకుండా బిజినెస్ కి తోడూ ఈ డబ్బులు కూడా వాళ్ళ కి పెట్టిన పెట్టుబడి ని వెనక్కి తీసుకు వచ్చేందుకు ఉపయోగ పడుతున్నాయి అని చెప్పాలి. కాగా రీసెంట్ టైం లో బాహుబలి ని పక్కకు పెడితే శాటిలైట్ రైట్స్ ద్వారా…
భారీ రేట్ల ను దండుకున్న సినిమాల్లో వినయ విధేయ రామ సినిమా టాప్ లో నిలిచింది అని చెప్పాలి, సినిమా శాటిలైట్ అండ్ స్ట్రీమింగ్ రైట్స్ కింద 25 కోట్లకు పైగా రేటు ని దక్కించు కోగా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ కింద ఏకంగా 23 కోట్ల దాకా దక్కిందట.
దాంతో టోటల్ గా 48 కోట్లకు పైగా డబ్బు శాటిలైట్ రైట్స్ కిందే వచ్చేంది, ఇక ఇప్పుడు ఆ ఇండస్ట్రీ రికార్డ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి బ్రేక్ చేసింది, సినిమా కి శాటిలైట్ రైట్స్ అండ్ స్ట్రీమింగ్ రైట్స్ కింద ఏకంగా…
27.5 కోట్ల రేటు దక్కగా, హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ఏకంగా 26 కోట్లు పలకడం తో ఓవరాల్ గా శాటిలైట్ రైట్స్ 53.5 కోట్ల రేటు దక్కిందట మహర్షి సినిమా కి దాంతో పాత రికార్డ్ ను ఏకంగా 5.5 కోట్ల రేంజ్ మార్జింగ్ తో అందుకుని దుమ్ము దులిపేశాడు సూపర్ స్టార్.
కాగా ప్రతిష్టాత్మక 25 వ సినిమా అవ్వడం తో అందరి లోను క్రేజ్ పీక్స్ కి వెళ్ళింది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి జోరు చూపుతుంది అన్నది ఆసక్తి గా మారింది, మే 9 న సినిమా బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎలా ఉంటుందో తెలియనుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.