Home న్యూస్ టక్ జగదీష్ వీర విహారం….10 రోజులైనా ఆగని జోరు!!

టక్ జగదీష్ వీర విహారం….10 రోజులైనా ఆగని జోరు!!

0

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూడగా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అనుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను అమెజాన్ ప్రైమ్ లో సొంతం చేసుకుంది. వినాయక చవితి కానుకగా సినిమా డైరెక్ట్ గా రిలీజ్ అవ్వగా సినిమా పై అంచనాలు భారీగా ఉండటం తో టాక్ మిక్సుడ్ గా వచ్చింది ఈ సినిమా కి…

సోషల్ మీడియా మొత్తం నెగటివ్ ట్వీట్స్ తో నిండిపోగా ఇక సినిమా కి వ్యూవర్ షిప్ కష్టమే అని అనుకున్నా సినిమా అందరినీ ఆశ్యర్య పరుస్తూ ఫస్ట్ వీక్ లో సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపిందని తెలుగు లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న…

సినిమాలు అన్నింటి లో కూడా హైయెస్ట్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.. ఇక అమెజాన్ ప్రైమ్ లో సినిమా సాధించిన ఓవరాల్ వ్యూవర్ షిప్ లెక్కలు నెల ఎండ్ టైం కి రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా సినిమా ప్రైమ్ వీడియో లో మాత్రం…

ఇప్పటికీ టాప్ 3 ప్లేసులలో మారుతూ ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం… నిన్న మొన్నటి వరకు టాప్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు బెల్ బాటం సినిమా రిలీజ్ అవ్వడం తో టాప్ 2 లేదా మూడో ప్లేసులో మారుతూ ట్రెండ్ అవుతుంది ఈ సినిమా… సినిమా కి సోషల్ మీడియా లో వినిపించిన నెగటివ్ టాక్ కి ఇలాంటి రెస్పాన్స్ ను…

ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేసి ఉండరని చెప్పొచ్చు… నాని వి మూవీ కూడా నెగటివ్ టాక్ తో అల్టిమేట్ వ్యూవర్ షిప్ ను లాస్ట్ ఇయర్ సొంతం చేసుకుంది. ఇప్పుడు టక్ జగదీష్ సినిమా కూడా ఏమాత్రం తక్కువ కాకుండా రెట్టించిన జోరు తో దుమ్ము లేపుతుంది… ఇక సినిమా నెల ఎండ్ టైం కి అఫీషియల్ వ్యూవర్ షిప్ లెక్కలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here