కోలివుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ డాక్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యింది, సినిమా డార్క్ కామెడీ థీమ్ తో తెరకెక్కగా కామెడీ ని ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతున్న సినిమా స్టొరీ వైజ్ చూసుకుంటే ఏమాత్రం కొత్తదనం లేకుండా తెరకేక్కినా సినిమా లో ఎక్కువ శాతం ఎంటర్ టైన్ మెంట్ క్లిక్ అవ్వడంతో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ ను…
సినిమా బాగానే ఆలరిస్తుంది. ఇక ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాలలో సినిమా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. 15 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అంచనా వేయగా సినిమా ఓవరాల్ గా 22 లక్షల దాకా షేర్ ని అందుకుందట. టోటల్ గ్రాస్ 40 లక్షల దాకా ఉంటుందని అంచనా..
ఇక తెలుగు లో రిలీజ్ రోజు కన్నా తరువాత రోజు 100 కొత్త స్కీన్స్ ని యాడ్ చేశారని తెలుస్తుంది. ఇక సినిమా తమిళనాడులో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 6.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుందని సమచారం. తమిళనాడు బయట ఇండియాలో…
తెలుగు తో కలిపి 70 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని అంటున్నారు. ఇక ఓవర్సీస్ లో సినిమా అన్ని చోట్లా కలిపి 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని అంటున్నారు. దాంతో ఫస్ట్ డే సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 10 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుందని అంటున్నారు ఇప్పుడు…
కోలివుడ్ తరుపున ఈ సినిమా సెకెండ్ వేవ్ తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. తమిళనాడు లో 50% ఆక్యుపెన్సీ తోనే ఈ రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి. ఇక వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక….