Home న్యూస్ వెంకిమామ డే 3 కలెక్షన్స్…ఇదేమి కుమ్ముడు సామి!!

వెంకిమామ డే 3 కలెక్షన్స్…ఇదేమి కుమ్ముడు సామి!!

2081
0

విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వెంకిమామ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లోనే 15 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయగా మూడో రోజు ఆదివారం అవ్వడం తో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తూ 3 వ రోజున అనుకున్న అంచనాలను కూడా మించేలా ఉంది.

VenkyMama 2 Days Total Collections Report!!

సినిమా రెండో రోజు తో కంపేర్ చేస్తే మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో తొలి 2 షోలకు కేవలం 5 నుండి 10% లోపు డ్రాప్స్ ని మాత్రమె సాధించగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు గ్రోత్ ఏకంగా 15% కి పైగా ఇంప్రూవ్ అయ్యింది. దాంతో ఇప్పుడు సినిమా…

VenkyMama Total Pre Release Business

రెండో రోజు కి మించి మూడో రోజు కలెక్షన్స్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. లెక్కలు అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా ఇప్పుడు మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 5 కోట్లకు పైగా షేర్ ని సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Venky Mama First Day Openings...Sensational ??

ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ లెక్క మరింత పెరిగే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజంగానే సెన్సేషనల్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు మూడో రోజు 6 కోట్ల నుండి 6.5 కోట్ల లోపు షేర్ ని అందుకోవచ్చు.

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో లేకపోతె ఈ లెక్క కొంచం తగ్గే అవకాశం ఉండగా మొత్తం మీద వీకెండ్ ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో ముగించనున్న వెంకీ మామ వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుంది అన్న దాని పై లాంగ్ రన్ లో ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది చెప్పగలం. ఇక వీకెండ్ అఫీషియల్ కలెక్షన్స్ రాగానే అప్ డేట్ చేస్తామ్.

Venky Mama 1st Day Worldwide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here