Home న్యూస్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీసర్ హిట్….బిజినెస్ లో మాస్ రికార్డ్!!

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీసర్ హిట్….బిజినెస్ లో మాస్ రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న హీరోలలో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) సినిమాతో ఈ సమ్మర్ లో సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు పెరిగేలా…

అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా…టీసర్ కి ఆడియన్స్ నుండి అనుకున్న దాని కన్నా కూడా బెటర్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. అందరూ పటాస్ సినిమా కి మరో వర్షన్ లా అనిపించేలా ఈ సినిమా ఉండబోతుందని అనిపించిందని అంటూ ఉండగా…

కంటెంట్ వైజ్ బాగానే వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని అంటూ ఉండగా…ఒక్క టీసర్ తో సినిమా మీద అంచనాలు పెరిగి బిజినెస్ పరంగా కూడా కుమ్మేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా ఇప్పుడు కళ్యాణ్ రామ్ కెరీర్ లో బెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుంటూ…

దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. లేటెస్ట్ గా సినిమా టీసర్ రెస్పాన్స్ ను చూసి కోస్టల్ ఆంధ్ర రీజన్ అలాగే సీడెడ్ ఏరియాల బిజినెస్ లు సాలిడ్ రేటుకి అమ్ముడు పోవడం విశేషం అని చెప్పాలి….కోస్టల్ ఆంధ్ర రీజన్ బిజినెస్ మొత్తం మీద…

12 కోట్ల రేంజ్ లో అమ్ముడుపోగా సీడెడ్ ఏరియా బిజినెస్ ఏకంగా 3.7 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ఏరియా బిజినెస్ రేటు 15.7 కోట్ల దాకా సొంతం అయ్యి కళ్యాణ్ రామ్ కెరీర్ లో రికార్డ్ బిజినెస్ ను సాధించింది. ఇక మిగిలిన ఏరియాల బిజినెస్ లు ఎలా జరుగుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here