Home న్యూస్ స్పెషల్: తెలుగు సినిమా కలెక్షన్స్ Vs తమిళ్ సినిమా కలెక్షన్స్ కి తేడా ఏంటి?

స్పెషల్: తెలుగు సినిమా కలెక్షన్స్ Vs తమిళ్ సినిమా కలెక్షన్స్ కి తేడా ఏంటి?

0

     హాయ్ ఫ్రెండ్స్ మరో T2B Q&A కి స్వాగతం…  ఈరోజు ప్రశ్న ఏంటంటే తెలుగు సినిమా కలెక్షన్స్ కి తమిళ్ సినిమా కలెక్షన్స్ కి ఉన్న తేడా ఏంటనేది ప్రశ్న.. ఇక జబాబులోకి వెళితే…. తెలుగు సినిమాలకి కలెక్షన్స్ వచ్చే ఏరియాలు రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక మరియు ఓవర్సీస్ లు ముఖ్య భూమిక పోషిస్తాయి. మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1650 పైగా థియేటర్స్ లో ఈజీగా భారీ కలెక్షన్స్ వస్తాయి.

ఆ లెవల్ ఎలాంటిదో బాహుబలి2-అజ్ఞాతవాసి-అరవింద సమేత-ఖైదీ150, భరత్ అనే నేను సినిమాలు 22-26 కోట్లకు పైగా కలెక్ట్ చేసి నిరూపించాయి. అదే తమిళ్ సినిమాలకు తమిళ్ నాడులో మహా అయితే 15 కోట్ల నుండి 20 కోట్ల మధ్యలో ఉంటాయి,

అది ఎంత పెద్ద సినిమా అయినా ఈ రేంజ్ లోనే ఉంటాయి కలెక్షన్స్. కానీ వాళ్లకి మనకి మించిన మార్కెట్ ఓవర్సీస్ లో ఉంది. తెలుగు సినిమాలకు US ప్రధాన౦గా కలెక్షన్స్ ఉంటే మిగిలిన లోకేషన్స్ లో చాలా తక్కువగానే కలెక్షన్స్ వస్తాయి. అదే తమిళ్ సినిమాలో పెద్ద సినిమాలకు తమిళ్ నాడులో

15 కోట్లు వస్తే ఆ సినిమా ఓవర్సీస్ లో 15 నుండి 20 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి. ఈ మధ్య రిలీజ్ అయిన తమిళ్ బిగ్గెస్ట్ హిట్స్ లో సర్కార్ కి తమిళనాడులో 20 కోట్ల కలెక్షన్స్ రాగా ఓవర్సీస్ లో 16.50 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. 2.0కి 9.5 కోట్లు రాగా ఓవర్సీస్ లో 24 కోట్లు వచ్చాయి.

అదే తెలుగు సినిమాల విషయానికి వస్తే అజ్ఞాతవాసి ఇక్కడ 26.6 కోట్ల షేర్ వసూల్ చేస్తే ఓవర్సీస్ లో 6.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అరవింద సమేత కి 26.64 కోట్లు రాగా ఓవర్సీస్ లో 4 కోట్లు మాత్రమే వచ్చాయి…..ఇది రెండు భాషల సినిమాలకు ఉన్న తేడా……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here