బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఫిబ్రవరిలో విదామయుర్చి సినిమాతో పెద్దగా అంచనాలను అందుకోలేక పోయిన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా టీసర్ ట్రైలర్ ల రిలీజ్ తర్వాత…
ఆడియన్స్ లో మంచి బజ్ ను అయితే సొంతం చేసుకుంది. ఇక సినిమా బిజినెస్ పరంగా కూడా మరోసారి అజిత్ కుమార్ స్టార్ పవర్ ను చూపించి కుమ్మేయడం విశేషం అని చెప్పాలి… తెలుగు లో మైత్రి వాళ్ళు సినిమాను ఓన్ గానే రిలీజ్ చేస్తూ ఉండగా…
వాల్యూ బిజినెస్ రేంజ్ 4.50 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…దాంతో సినిమా తెలుగు లో సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే అటూ ఇటూగా 5 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక తమిళనాడులో అజిత్ స్టార్ పవర్ తో సినిమా వాల్యూ బిజినెస్…
75 కోట్ల రేంజ్ లో ఉందని అంచనా…ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 114 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా….విదామయుర్చి మూవీ వరల్డ్ వైడ్ గా 91 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా ఆ టార్గెట్ ను అందుకోలేక పోయింది.
ఇక ఇప్పుడు ఆ సినిమాతో పోల్చితే చాలా బెటర్ బజ్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఇనీషియల్ రిపోర్ట్ లు పర్వాలేదు అనిపించేలా ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 116 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన..
అవసరం ఉండగా గ్రాస్ పరంగా 220 కోట్లకు పైగా గ్రాస్ ను దక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అజిత్ కి ఉన్న క్రేజ్ పవర్ దృశ్యా సినిమాకి ఏమాత్రం టాక్ బాగున్నా కూడా ఈ టార్గెట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.