Home న్యూస్ ఇండియాలో ఫస్ట్ 100 కోట్ల సినిమా…14 ఏళ్ల ఎపిక్ రికార్డ్ ఇదీ!

ఇండియాలో ఫస్ట్ 100 కోట్ల సినిమా…14 ఏళ్ల ఎపిక్ రికార్డ్ ఇదీ!

2296
0

ఇప్పుడంటే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ టికెట్ హైక్స్ పుణ్యాన రిలీజ్ అయిన మొదటి రోజే కొన్ని సినిమాలు ఏకంగా 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధ్యం అవుతున్నాయి కానీ ఒకప్పుడు ఇలాంటివి లేవు, ఒక సినిమా లాంగ్ రన్ లో కూడా ఈ మార్క్ ని అందుకోవడానికి ఏళ్ళకి ఏళ్ళు టైం పట్టింది. ఇండియన్ సినిమాలలో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని ఇండియా లోనే సొంతం చేసుకున్న మొట్ట మొదటి సినిమా…

సూపర్ స్టార్ రజినీకాంత్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందిన శివాజీ సినిమా. 2007 లో జూన్ 15 న రిలీజ్ అయిన ఈ సినిమా సౌత్ ఇండియా ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలనం సృష్టించింది. కోలివుడ్ తరుపునే కాకుండా ఇండియా తరుపున కూడా…

ఫుల్ ఫ్లెట్చుడ్ ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది, తెలుగు లో కూడా అల్టిమేట్ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల నుండే 2007 టైం లోనే ఏకంగా 18 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది.

అలాంటి విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి నేటితో 14 ఏళ్ళు పూర్తీ అవ్వడం విశేషం, సౌత్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 68 కోట్ల రేంజ్ లో షేర్ ని టోటల్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో 133 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

తెలుగు రాష్ట్రాలలో 50 రోజులను 39 డైరెక్ట్ సెంటర్స్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీ లో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ ని సాధించి సత్తా చాటుకుంది. రజినీ బాక్స్ ఆఫీస్ స్టామినా ని నిరూపించిన ఈ సినిమా రోబో రూపొందేలా చేయడానికి మంచి పునాది వేసింది అని చెప్పొచ్చు.

బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచేజ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇక ఆగిపోనుంది!
హాలీవుడ్ లో సీక్వెల్స్ హవా ఎప్పటి నుండో కొనసాగుతూ వస్తుంది, ఒక సినిమా హిట్ అయితే చాలు ఆ సినిమా కి సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి అక్కడ, జేమ్స్ బాండ్ సిరీస్ ఏ రేంజ్ లో ఎక్కువ పార్టులతో ఫేమస్ అయిందో యాక్షన్ లవర్స్ ని ఆకట్టుకుంటూ ఫేమస్ అయిన మరో సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ అని చెప్పోచ్చు. మొత్తం మీద ఇప్పటి వరకు…

9 పార్టులు రాగా 9 వ పార్ట్ ఇండియా లో ఈ నెల ఎండ్ టైం లో రిలీజ్ కావడానికి సిద్ధం అవుతుంది, రేసింగ్ కార్లు, భారీ యాక్షన్ సీన్స్ తో ఫుల్ పాపులర్ అయిన ఈ ఫ్రాంచేజ్ ఇప్పుడు ఎండ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది అన్నది లేటెస్ట్ హాట్ టాపిక్…

అలాంటి ఈ సిరీస్ మరో రెండు పార్టులతో ఎండ్ కాబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు సినిమా హీరో విన్ డిసెల్. 2023 లోపు ఈ ఫ్రాంచేజ్ నుండి మరో రెండు పార్టులు ఆడియన్స్ ముందుకు వస్తాయని, ఆ రెండు పార్టులు రిలీజ్ అయ్యాక ఈ ఫ్రాంచేజ్ ఇక ముగుస్తుందని కన్ఫాం చేశాడు.

ఇప్పటికి 9 పార్టులు ఆడియన్స్ ముందుకు రాగా వచ్చే ఇయర్ ఎండ్ లో మరో పార్ట్ తర్వాత 2023 సమ్మర్ టైం లో లాస్ట్ పార్ట్ వస్తుందని, దాంతో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ ఆగిపోతుందని కన్ఫాం చేశాడు. వరల్డ్ వైడ్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరించిన సిరీస్ లలో ఒకటైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎండ్ కాబోతుంది అన్న న్యూస్ తో ఫ్యాన్స్ ఫీల్ అవ్వడం ఖాయం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here