బాక్స్ ఆఫీస్ దగ్గర అడివి శేష్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మేజర్ మూవీ హిందీ లో అనుకున్న రేంజ్ లో క్లిక్ అయి ఉంటె కలెక్షన్స్ మరో రేంజ్ లో ఉండేవి. అయినా కానీ ఉన్నంతలో బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయిన తర్వాత డిజిటల్ లో రిలీజ్ అవ్వగా…
అక్కడ కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కి అక్కడ సాలిడ్ వ్యూవర్ షిప్ సొంతం అవ్వగా సినిమా డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత ఆల్ మోస్ట్ 14 దేశాల్లో సినిమా టాప్ 10 లో ట్రెండ్ అవుతున్న సినిమాగా…
దుమ్ము లేపుతూ దూసుకు పోతుందని నెట్ ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు… చిన్న సినిమా నే అయినా ఏకంగా 14 దేశాల్లో టాప్ 10 ట్రెండ్ అవుతున్న సినిమాల్లో ఒకటిగా ఉండటం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా వ్యూవర్ షిప్ కూడా సాలిడ్ గా ఉందని అంటున్నారు. త్వరలోనే ఆ లెక్కలు తేలనున్నాయి….