వెండితెరపై ఆకట్టుకున్న విజయం లేదు…ఇప్పుడు బుల్లితెరపై అఖిల్ మంత్రం పని చేస్తుందా!

0
561

అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన రీసెంట్ మూవీ మిస్టర్ మజ్ను బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుంది అని అంతా భావించారు, సినిమా కి మంచి రివ్యూ లు టాక్ కూడా బాగానే వచ్చినా కానీ అదృష్టం కలిసి రాలేదు.

దాంతో వెండి తెరపై అంచనాలను అందుకోలేక పోయిన మిస్టర్ మజ్ను టోటల్ గా అఖిల్ కెరీర్ లో మూడో ఫ్లాఫ్ గా మిగిలి పోగా ఇప్పుడు బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి వచ్చేస్తుంది. సినిమా జీ తెలుగు లో త్వరలో టెలికాస్ట్ కానుంది.

మార్చి 17 న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కాబోతున్న మిస్టర్ మజ్ను సినిమా ఎంతవరకు బుల్లితెరపై ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుంది అన్నది ఆసక్తి గా మారింది, ఇక అఖిల్ 4 వ సినిమా అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతుందట.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!