Home న్యూస్ అరవింద సమేత ఆడియో రిలీజ్ డేట్ ఇదే!…కాచుకోండి ఇక

అరవింద సమేత ఆడియో రిలీజ్ డేట్ ఇదే!…కాచుకోండి ఇక

1

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ పై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే..కాగా రీసెంట్ గా హరికృష్ణ గారి హఠాన్మరణం వలన అరవింద సమేత షూటింగ్ డిలే అవుతుందని అంతా భావించారు.

కానీ గుండె నిబ్బరం చేసుకుని నిర్మాత కి నష్టం కలగకూడదని ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొనగా ఇప్పుడు షూటింగ్ శరవేగంగా జరుగుతుందని సమాచారం. ఇక సినిమా ఆడియో రిలీజ్ కి డేట్ ని ఆల్ మోస్ట్ కంఫామ్ చేశారు అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది .

ఈ నెల 23 న సినిమా ఆడియో ని డైరెక్ట్ గా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందొ ఇంకా తెలియదు కానీ ఈ డేట్ కంఫామ్ అవ్వడం ఖాయమని మాత్రం అంటున్నారు..దాంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచసూస్తున్నారు. 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here