ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీమియర్ షో కలెక్షన్స్…కెరీర్ లో న్యూ రికార్డ్

0
211

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ఓపెన్ అయింది, కాగా సినిమా కి ఓవర్సీస్ ప్రీమియర్ షోల కి స్నో ఫాల్ వలన కొంచం ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి. ఊహించని దానికన్నా ఎక్కువ చలి ఉండటం తో భారీ ఎత్తున ఆడియన్స్ థియేటర్స్ కి రాలేదు. ఉన్నంతలో సినిమా ప్రీమియర్ షోల ద్వారా..

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు అఫీషియల్ గా 455k డాలర్స్ ని వసూల్ చేయగా… మరిన్ని లోకేషన్స్ లో కలెక్షన్స్ ని యాడ్ చేయాల్సి ఉందట. అవి కూడా కలుపుకుంటే సినిమా ప్రీమియర్ షోల కలెక్షన్స్ మొత్తం మీద 510k – 520k రేంజ్ లో ఉంటుందని సమాచారం.

ఇది బాలయ్య కెరీర్ లో న్యూ రికార్డ్ అనే చెప్పాలి. ఇది వరకు గౌతమీపుత్ర శాతకర్ణి ఆల్ మోస్ట్ 400k~ వరకు కలెక్షన్స్ ని ప్రీమియర్ షోల తో అందుకోగా ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు స్టడీగా ఇలానే ఉంటె వీకెండ్ ముగిసే సమయానికి మరిన్ని కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!