Home న్యూస్ ఇదీ రజినీ మాస్ అంటే….అన్నట్టే టీసర్ రివ్యూ…పూనకాలు ఖాయం!!

ఇదీ రజినీ మాస్ అంటే….అన్నట్టే టీసర్ రివ్యూ…పూనకాలు ఖాయం!!

1342
0

కోలివుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో సరైన హిట్ అందుకోలేదు, కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించినా కానీ అవి ఒకప్పటి రజినీ మార్క్ విజయాలు అయితే కాదు, ఇక తెలుగు లో కూడా చాలా టైం గా హిట్ దూరం అయిన రజినీ రీసెంట్ టైం లో విశ్వాసం సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసిన శివ డైరెక్షన్ లో అన్నట్టే సినిమా చేయగా….

ఈ సినిమా దీపావళి కానుకగా వచ్చే నెల 4 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా తెలుగు వర్షన్ కూడా అదే రోజు వస్తుంది అని అంటూ ఉండగా తెలుగు పోస్టర్స్ కానీ సాంగ్స్ కానీ ఏమి ఇంకా రిలీజ్ చేయలేదు, ఇక రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను…

తమిళ్ వర్షన్ ది రిలీజ్ చేశారు, టీసర్ లెంత్ ఆల్ మోస్ట్ ట్రైలర్ రేంజ్ లోనే ఉండగా వింటేజ్ మాస్ రజినీని చూసినట్లు టీసర్ మొత్తం గూస్ బంప్స్ స్టఫ్ తో నిండిపోయింది అని చెప్పాలి, మాస్ ఫైట్స్, వింటేజ్ రజినీ లుక్స్, యాక్షన్ బ్లాక్స్, టీసర్ క్లైమాక్స్ లారీలు…

బ్లాస్ట్ అవుతూ ఉంటే రజినీ స్టైల్ గా మీసం మెలేస్తూ వెళుతూ ఉండటం, చివర్లో ఉయ్యాలలో కూర్చున్న స్టైల్ నరసింహా సినిమాను గుర్తు చేయగా, బైక్ పై కత్తి పట్టుకుని నడిపే సీన్ ఇలా టీసర్ లో హైలెట్ అనిపించిన షాట్స్ చాలానే ఉన్నాయి. ఇక ఈ షాట్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా భారీగా హెల్ప్ అయ్యింది అని చెప్పాలి.

ఓవరాల్ గా సినిమా పై ఉన్న అంచనాలను టీసర్ భారీగా పెంచేసింది అని చెప్పాలి, ఫ్యాన్స్ అయితే టీసర్ లో రజినీని చూస్తె పూనకాలు ఖాయమని చెప్పొచ్చు. ఇక రెగ్యులర్ ఆడియన్స్ ఎంతవరకు సినిమాను ఓన్ చేసుకుంటారు అన్న దానిపై సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు ఏ రేంజ్ లో రెచ్చిపోతుంది అన్నది చెప్పగలం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here