బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వర్షాలు వీకెండ్ లో సాలిడ్ గా కలెక్షన్స్ పై ఎదురుదెబ్బ తీసినా కూడా నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా అన్ని చోట్లా ఓవరాల్ గా మంచి జోరునే చూపించి కలెక్షన్స్ పరంగా మంచి రికవరీని సొంతం చేసుకోగా…
మొత్తం మీద టోటల్ టార్గెట్ ను అందుకోవడానికి పరుగులు పెడుతూ ఉండగా రీసెంట్ గా ఓవరాల్ గా 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఓవర్సీస్ లో బిజినెస్ ను రికవరీ చేసేసి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాని కూడా కంప్లీట్ చేసుకోగా మిగిలిన చోట్ల కూడా చాలా వరకు బిజినెస్ ను రికవరీ చేస్తూ…
దూసుకు పోతున్న సరిపోదా శనివారం సినిమా ఇప్పుడు రెండో బ్రేక్ ఈవెన్ ఏరియాను కూడా కంప్లీట్ చేసుకుంది. సినిమాకి కర్ణాటక, తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలిపి 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ కి గాను 4 రోజుల్లో మొత్తం మీద 4.75 కోట్ల రేంజ్ లో…
షేర్ ని అందుకున్న సరిపోదా శనివారం సినిమా 5వ రోజు వర్కింగ్ డే అయినా కూడా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపించి బిజినెస్ ను రికవరీని చేసిన సినిమా 6వ రోజు కలెక్షన్స్ తో ఇప్పుడు ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యింది అని చెప్పాలి ఇప్పుడు…
దాంతో తెలుగు రాష్ట్రాల ఆవల టోటల్ గా సినిమా బిజినెస్ మొత్తాన్ని రికవరీ చేసేసి లాభాలలోకి కూడా ఎంటర్ అయ్యింది అని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా నైజాంలో మంచి రికవరీని సొంతం చేసుకున్న సినిమా ఆంధ్ర సీడెడ్ లలో మాత్రం ఫుల్ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.