Home న్యూస్ సైరా టీసర్ రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!

సైరా టీసర్ రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!

1535
0

     టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి అఫీషియల్ టీసర్ 2 భారీ క్రేజ్ నడుమ నేడు తెలుగు తో పాటు తమిళ్, హిందీ, మళయాలమ్, మరియు కన్నడ భాషల్లో ఒకే సమయం లో రిలీజ్ అయ్యింది. కాగా టీసర్ ఆద్యంతం ఆకట్టుకోగా సినిమా పై ఉన్న క్రేజ్ మాత్రం భారీ గా పెరిగి పోయేలా సినిమా టీసర్ ఉందని చెప్పొచ్చు. కాగా టీసర్ లో ముందు హైలెట్స్ విషయానికి వస్తే…

ఈ ఏజ్ లో కూడా మెగాస్టార్ సినిమా కోసం పడ్డ కష్టం, అలాగే బాడీ ని మార్చుకున్న తీరు కి హాట్సాఫ్ చెప్పాల్సిందే, ఇక టీసర్ లో డైలాగ్స్ కానీ చివర్లో ఘర్జిస్తున్నట్లు పలికిన భారీ సీన్స్ కానీ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయని చెప్పాలి.

 ఇక అందరు పాత్రల పరిచయం మరోసారి చేయగా బ్యాగ్రౌండ్ స్కోర్ మరోసారి గూస్ బంప్స్ ని తెప్పించేసింది. టీసర్ కి మరో హైలెట్ గా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం, చివర్లో సైరా నరసింహ రెడ్డి అంటూ గట్టిగా అవరడం మరింత గూస్ బంప్స్ తెప్పించాయి.

ఇక మైనస్ ల విషయానికి వస్తే చిరు లుక్ బాగుంది కానీ పెర్ఫెక్ట్ గా సెట్ కాలేదు, అదొక్కటి తప్పితే టీసర్ మొత్తం గూస్ బంప్స్ తో నిండిపోయింది. ఓవరాల్ గా అన్ని భాషల విషయం తెలియదు కానీ తెలుగు లో సినిమా కి టాక్ వస్తే లెక్క 120 కోట్ల నుండి మొదలు అవుతుంది.

అది ఫైనల్ గా ఎంతవరకు వెళుతుందో చెప్పలేమని చెప్పొచ్చు. మిగిలిన భాషలు కూడా సహకరిస్తే బాక్స్ ఆఫీస్ బరిలో మెగాస్టార్ పేరిట సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉన్న సినిమా సైరా నరసింహా రెడ్డి అని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here