సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ ని పూర్తీ చేసుకుని వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టింది. కాగా సినిమా మొత్తం మీద 11 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారింది. సినిమా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…ముందుగా గ్రాస్ వివరాలలో హిందీ వర్షన్ 218 కోట్ల గ్రాస్ ని అందుకోగా, తెలుగు వర్షన్ మొత్తం మీద 81 కోట్ల గ్రాస్ ని అందుకుంది.
ఇక తమిళ్ వర్షన్ 95 కోట్ల గ్రాస్ ని అందుకోగా కర్ణాటకలో లో సినిమా 40 కోట్ల గ్రాస్ ని కేరళలో సినిమా 18.6 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దాంతో ఇండియా లో సినిమా 452.6 కోట్ల గ్రాస్ ని అందుకోగా టోటల్ ఓవర్సీస్ లో సినిమా 140 కోట్ల గ్రాస్ ని అందుకుంది.
ఇక సినిమా షేర్ వివరాలలో హిందీ కి 105 కోట్ల షేర్ ని, తెలుగు లో 48 కోట్లు, తమిళ్ లో 47 కోట్లు, కర్ణాటకలో 22 కోట్లు, కేరళలో 9 కోట్లు షేర్ ని అందుకోగా ఇండియా లో టోటల్ గా 231 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక ఓవర్సీస్ లో 72 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా సినిమా 303 కోట్ల షేర్ ని అందుకుంది. 360 కోట్ల బిజినెస్ కి సినిమా మరో 60 కోట్ల షేర్ ని 125 కోట్ల గ్రాస్ ని అందుకోవాల్సి ఉంది.