యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి టాక్ డీసెంట్ గానే వచ్చినా కానీ కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో అయితే సొంతం చేసుకోలేక పోయింది ఈ సినిమా. సినిమా రేంజ్ కి మించి బిజినెస్ జరగడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం సినిమా కష్టపడుతుంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కాకుండా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది, శాటిలైట్ రైట్స్ కి సాలిడ్ రేటు కూడా సొంతం అయ్యిందని అంటున్నారు, సుమారు 2.7 కోట్ల రేంజ్ లో రేటు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కింద సొంతం అయ్యిందని….
ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది, సినిమా జానర్ అండ్ కంప్లీట్ ఫ్యామిలీ మూవీ అవ్వడంతో కొంచం రేటు అనుకున్న దాని కన్నా ఎక్కువే సొంతం అయ్యిందని చెబుతూ ఉండటం విశేషం, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అంచనాలను అందుకోలేక పోయినా కానీ టెలివిజన్ లో మాత్రం కచ్చితంగా ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఉంది ఈ సినిమాకి…