బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలు ఏమి లేక పోయినా కానీ ఉన్నంతలో మంచి బిజినెస్ లతో మేకర్స్ కి ప్రాఫిట్స్ ఇచ్చే రేంజ్ కి ఎదిగిన యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా ధమ్కి సినిమా తో రాగా సినిమా ఫైనల్ రన్ లో మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమాలు గామీ(Gaami Movie) మరియు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs of Godavari)….
త్వరలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమాకి విశ్వక్ సేన్ మాత్రం భారీ ఎత్తున రెమ్యునరేషన్ ని ఇప్పుడు తీసుకుంటున్నాడని టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా బజ్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది….
ధమ్కికి ముందు వరకు ఒక్కో సినిమా కి 2.5 కోట్లకు అటూ ఇటూగా పారితోషికం తీసుకునే విశ్వక్ సేన్ ధమ్కి తర్వార ఒప్పుకోబోయే సినిమాలకు మాత్రం ఒక్కో సినిమా కి 4.50 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. కాగా విశ్వక్ సేన్ సినిమాలకు….
నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరుగుతూ ఉండటంతో ఈ రెమ్యునరేషన్ కి కూడా ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటాడు అన్నది ఆసక్తిగా మారిందని చెప్పాలి ఇప్పుడు… గామీ మరియు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయితే విశ్వక్ సేన్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు.
1