బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie), షారుఖ్ డంకి మరియు ప్రభాస్ సలార్(Salaar) లు రిలీజ్ అవ్వడంతో థియేటర్స్ ని కోల్పోయినా కూడా ఉన్నంతలో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే…
లాస్ట్ 2 రోజుల్లో మంచి కలెక్షన్స్ తో జోరు చూపించడం విశేషం. సినిమా 15వ రోజున 16 లక్షల షేర్ ని అందుకోగా, 16వ రోజుకి వచ్చే సరికి 15 లక్షల షేర్ ని ఇప్పుడు 17వ రోజుకి వచ్చేసరికి 19 లక్షల షేర్ ని అందుకుంది, ఓవర్సీస్ లో కూడా ఇప్పటికీ మంచి జోరుని చూపిస్తూ 1.8 మిలియన్ మార్క్ ని దాటేసి దుమ్ము లేపింది ఈ సినిమా…
ఓవరాల్ గా సినిమా 17 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Hi Nanna Movie 17 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 11.51Cr
👉Ceeded: 2.56Cr
👉UA: 2.43Cr
👉East: 1.31Cr
👉West: 79L
👉Guntur: 1.21Cr
👉Krishna: 1.20Cr
👉Nellore: 59L
AP-TG Total:- 21.60CR(39.05CR~ Gross)
👉KA+ROI: 4.10Cr~
👉OS: 8.90Cr~
Total WW Collections – 34.60CR(65.80CR~ Gross)
సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 6.10 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. రెండు బిగ్ మూవీస్ నడుమ కూడా లిమిటెడ్ థియేటర్స్ లో షేర్స్ ని సినిమా సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం, ఇక ఈ రోజు సండే రేపు క్రిస్టమస్ హాలిడేస్ లో కూడా సినిమా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.