బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) మూడో వారంలో సలార్(salaar part 1 – ceasefire) మరియు డంకి(Dunki Movie) ల నుండి పోటి ఉండటంతో స్క్రీన్స్ చాలా తగ్గినా కూడా ఉన్న లిమిటెడ్ స్క్రీన్స్ లోనే మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతుంది.
సినిమా 18వ రోజున రెట్టించిన జోరు చూపించి సాలిడ్ గా జోరు చూపించింది, ఉన్న సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా హాయ్ నాన్నని ప్రిఫర్ చేయగా కొన్ని చోట్ల స్క్రీన్స్ కూడా పెరిగాయి… 17వ రోజు 19 లక్షల షేర్ ని అందుకున్న సినిమా 18వ రోజుకి వచ్చే సరికి డబుల్ కి పైగా గ్రోత్ ని చూపించి…
ఏకంగా 47 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 65 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది 1.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా టోటల్ గా ఇప్పుడు 18 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Hi Nanna Movie 18 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 11.80Cr
👉Ceeded: 2.61Cr
👉UA: 2.48Cr
👉East: 1.33Cr
👉West: 80L
👉Guntur: 1.23Cr
👉Krishna: 1.22Cr
👉Nellore: 60L
AP-TG Total:- 22.07CR(39.95CR~ Gross)
👉KA+ROI: 4.18Cr~
👉OS: 9.00Cr~
Total WW Collections – 35.25CR(67.10CR~ Gross)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 18 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా సాధించిన కలెక్షన్స్ మీద 6.75 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.