బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం హాట్రిక్ విజయాలను నమోదు చేసి కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను…
సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమాతో నాని టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఎక్కువ సార్లు 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించగా… మూడో వారంలో కూడా జోరు చూపిస్తున్న సినిమా…
ఇప్పుడు 16 రోజుల్లో ఆల్ మోస్ట్ 49 కోట్ల లోపు షేర్ ని అందుకోగా 17వ రోజు మంచి జోరు చూపించిన సినిమా ఆల్ మోస్ట్ 49.5 కోట్ల లోపు షేర్ ని అటూ ఇటూగా అందుకుంది…ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది..
సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే 18వ రోజు సాధించే కలెక్షన్స్ తో 50 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉండగా ఒకవేళ మిస్ అయితే వర్కింగ్ డేస్ లో ఆ మార్క్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో…
రెండు సార్లు 50 కోట్ల షేర్ మార్క్ ని ఎవ్వరూ అందుకోలేదు. కానీ ఇప్పుడు ఆ ఎపిక్ రికార్డ్ ను అందుకోవడానికి నాచురల్ స్టార్ నానికి సాలిడ్ గా అవకాశం ఉంది. సినిమా కూడా మంచి జోరునే చూపెడుతూ ఉండటం తో ఈ మార్క్ ని అతి త్వరగా అందుకుని లాభాలాను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.