బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఎపిక్ ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి మూడో వారంలో కూడా మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా…
సినిమా భారీ వర్షాల వలన తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్ గట్టిగానే పడినా కూడా లాంగ్ రన్ లో మంచి జోరుని చూపెడుతూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా బిజినెస్ ను పూర్తిగా రికవరీ చేసి రచ్చ చేసింది. ఇక సినిమా మూడో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర…
కొత్త సినిమాలను తట్టుకుని మంచి జోరు చూపించి ఇప్పుడు ఓవరాల్ గా మూడో వీకెండ్ కంప్లీట్ చేసుకునే టైంకి ఓవరాల్ గా 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్షాల వలన ఇబ్బంది పడినా కూడా…
ఇప్పటి వరకు రన్ ను కొనసాగించి 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఓవరాల్ గా 50 కోట్ల షేర్ మార్క్ ని దాటగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో రెండు సార్లు 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న ఒకే ఒక్క హీరోగా నిలిచాడు నాని…
లాస్ట్ ఇయర్ దసరాతో మాస్ రచ్చ చేసిన నాని ఇప్పుడు సరిపోదా శనివారంతో రెండో సారి 50 కోట్ల షేర్ ని అందుకుని మాస్ రచ్చ చేశాడు. మిగిలిన హీరోలు ఎవ్వరూ కూడా ఈ రికార్డ్ ను అందుకోలేదు. దాంతో ఫస్ట్ టైం మీడియం రేంజ్ హీరోలలో ఈ రికార్డ్ కొట్టిన నాని అప్ కమింగ్ మూవీస్ తో…
ఇదే ఫామ్ ని కొనసాగిస్తే తన మార్కెట్ రేంజ్ మరింతగా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది…ఇక మిగిలిన మీడియం రేంజ్ హీరోలు ప్రస్తుతం ఫామ్ లో లేక పోవడం, నాని ఒక్కడే బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.