బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలు ఏవి కూడా జనాలను తిరిగి థియేటర్స్ లోకి రప్పించ లేక పోయాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న సినిమాల్లో ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్ గా తిరిగి హిట్2 సినిమా నిలిచింది. దాంతో తిరిగి గ్రోత్ ని చూపించడం స్టార్ట్ చేసింది ఈ సినిమా… సినిమా రెండో వారంలో కొత్త సినిమాల కోసం థియేటర్స్ ని కోల్పోవాల్సి వచ్చినా…
ఉన్న థియేటర్స్ లో ఇప్పుడు 8వ రోజు తో పోల్చితే 15% రేంజ్ లో గ్రోత్ ని చూపించిన సినిమా ఈవినింగ్ షోలకు ఇంకొంచం గ్రోత్ నే చూపిస్తూ ఉంది. దాంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 9వ రోజున అటూ ఇటూగా…
30 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ అఫీస్ దగ్గర మొత్తం మీద…
50 లక్షల నుండి 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. కొత్త సినిమాల నిరాశాజనకమైన ప్రదర్శన వలన ఇప్పుడు హిట్2 సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం అడ్వాంటేజ్ కాబోతుంది. ఇక సినిమా టోటల్ గా 9 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.