కొత్త బంగారు లోకం సినిమా తో టాలీవుడ్ లో డైరెక్టర్ గా అడుగు పెట్టిన శ్రీకాంత్ అడ్డాల ఆ సినిమా తో తన మార్క్ ని చూపెట్టగా రెండో సినిమా నే ఏకంగా టాలీవుడ్ లో ఆగిపోయిన మల్టీ స్టారర్ ట్రెండ్ ని తిరిగి మొదలు పెడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ ల కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు…
తర్వాత ముకుంద సినిమా తో నిరాశ పరచగా మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాతో ఛాన్స్ కొట్టి ఆ సినిమా కి ఏకంగా 9 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని కూడా అందుకోగా ఆ సినిమా డిసాస్టర్ తర్వాత అడ్డాల కొత్త సినిమా మొదలు పెట్టడానికి ఆల్ మోస్ట్ 4 ఏళ్ల టైం పట్టగా…
తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అసురన్ సినిమా తెలుగు రీమేక్ ని విక్టరీ వెంకటేష్ తో నారప్ప పేరు తో రీమేక్ చేయగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రావాల్సింది కానీ పరిస్థితుల వలన డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది.
అయినా కానీ అక్కడ సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఓవరాల్ గా అల్టిమేట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ టైం లో రోజుకి 2 లక్షల రెమ్యునరేషన్ చొప్పున పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల సినిమా షూటింగ్ పూర్తీ అయ్యే టైం కి 90 లక్షల దాకా రెమ్యునరేషన్ ని అందుకోగా ఇప్పుడు సినిమా డిజిటల్ లో…
సూపర్ హిట్ అవ్వడం ఓవరాల్ గా అల్టిమేట్ బిజినెస్ ను సాధించి నిర్మాతలకు సూపర్ ప్రాఫిట్స్ ను తెప్పించడంతో అడ్డాలకి రెమ్యునరేషన్ బోనస్ కింద మరో 1.1 కోట్ల రెమ్యునరేషన్ ని ఇచ్చారట. దాంతో ఇప్పుడు నారప్ప సినిమా కి ఓవరాల్ రెమ్యునరేషన్ కింద 2 కోట్ల రెమ్యునరేషన్ ని అందుకున్నాడు. ఊహకందని డిసాస్టర్ అయిన బ్రహ్మోత్సవం తర్వాత శ్రీకాంత్ అడ్డాలకి మంచి కంబ్యాక్ గా నిలిచింది నారప్ప…