Home న్యూస్ ఇక్కడ డిసాస్టర్ అయినా అక్కడ టాప్ 2తో పంబ రేపుతుందిగా!

ఇక్కడ డిసాస్టర్ అయినా అక్కడ టాప్ 2తో పంబ రేపుతుందిగా!

3055
1

యాక్షన్ హీరో గోపీచంద్ ఈ మధ్య వరుస ఫ్లాఫులలో ఉన్న టైం లో కంబ్యాక్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో సీటిమార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జనాలను తిరిగి థియేటర్స్ కి రప్పించి గోపీచంద్ కి రీసెంట్ టైం లో కంబ్యాక్ మూవీ లా నిలిచింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఓవరాల్ గా క్లీన్ హిట్ ని అందుకోలేక పోయిన ఈ సినిమా ఓవరాల్ గా ఉన్న పరిస్థితులను…

గమనిస్తే మంచి రిజల్ట్ నే సొంతం చేసుకుంది. ఈ సినిమా అడ్వాంటేజ్ ను వాడుకోవాలని ఎప్పటి నుండో ఆగిపోయిన గోపీచంద్ నటించిన ఓల్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ ని ఆడియన్స్ ముందుకు అక్టోబర్ నెలలో తీసుకు వచ్చారు. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా అనేక సార్లు పోస్ట్ పోన్ అవుతూ…

ఇక రాదేమో అనుకుంటూ ఉండగా డిజిటల్ లో డైరెక్ట్ రిలీజ్ కి లాస్ట్ ఇయర్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పిన మేకర్స్ సినిమాను సీటిమార్ రిజల్ట్ తో కలెక్షన్స్ వస్తాయని థియేటర్స్ లో రిలీజ్ అయినా కానీ జనాలు అనుకున్న రేంజ్ లో రాక టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి..

1.38 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తీ చేసుకుంది. ఇక ఈ సినిమాను రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ చేశారు. థియేటర్స్ లో చూడకుండా ఉన్న వాళ్ళు అందరూ కూడా డిజిటల్ లో సినిమాను చూడటం మొదలు పెట్టగా సినిమా కి అక్కడ సాలిడ్ వ్యూవర్ షిప్ లభిస్తూ దూసుకు పోతుందని సమాచారం.

సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులకు పైనే అవుతున్నా ఇప్పటికీ టాప్ ప్లేస్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతుంది ఈ సినిమా. డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కానీ డిజిటల్ లో మాత్రం సాలిడ్ వ్యూస్ తో దూసుకు పోతున్న ఈ సినిమా కొన్న రేటు కి ఫుల్ న్యాయం చేస్తుందని అంటున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here