Home న్యూస్ సీనియర్ హీరోల్లో బాలయ్య అఖండ టీసర్ రికార్డ్…సౌత్ లో ఏ ప్లేసులో ఉందంటే!

సీనియర్ హీరోల్లో బాలయ్య అఖండ టీసర్ రికార్డ్…సౌత్ లో ఏ ప్లేసులో ఉందంటే!

2402
0

బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర అతి త్వరలో సందడి చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే, రీసెంట్ గా ఉగాది కానుకగా సినిమాలోని రెండో క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ సినిమా టైటిల్ ను కూడా కన్ఫాం చేస్తూ రిలీజ్ చేసిన టీసర్ గ్లిమ్స్ సంచలన రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం…

ఈ టీసర్ కి రెస్పాన్స్ అదిరిపోయే విధంగా రావడమే కాదు ఇప్పుడు టాలీవుడ్ తరుపున రికార్డ్ కూడా సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ సొంతం చేసుకున్న టీసర్ లలో ఒకటిగా నిలిచిన ఈ టీసర్ సీనియర్ హీరోల పరంగా మాత్రం కొత్త రికార్డ్ నే నమోదు చేసింది.

టీసర్ లలో హైయెస్ట్ వ్యూస్ ను సీనియర్స్ లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది, ఇది వరకు చిరు సైరా నరసింహా రెడ్డి టీసర్ కి 22 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కగా ఈ టీసర్ ఆ మార్క్ ని క్రాస్ చేసి ఇప్పుడు 25 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకు పోతుంది.

కానీ లైక్స్ పరంగా ఆచార్య మరియు సైరాలు ఇప్పటికీ అఖండ కన్నా టాప్ లో ఉన్నాయి. కానీ వ్యూస్ పరంగా టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన అఖండ సౌత్ టీసర్ ల జాబితా లో కూడా చోటు సొంతం చేసుకోవడం విశేషం, టాప్ లో సూపర్ స్టార్ రజినీ కబాలి టీసర్ 37 మిలియన్స్ తో ఉండగా తర్వాత కాలా 32 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో…

తర్వాత రోబో 2.0 27 మిలియన్స్ పైగా వ్యూస్ తో సింగిల్ లాంగ్వేజ్ లో సొంతం చేసుకున్నాయి, వాటి తర్వాత ఇప్పుడు అఖండ నిలిచింది. ఇక సినిమా కి సంభందింఛి ఇవి ఇంట్రో టీసర్లే కాగా మెయిన్ టీసర్ అండ్ ట్రైలర్ లు రిలీజ్ అవ్వాల్సి ఉంది. మొత్తం మీద వ్యూస్ పరంగా అల్టిమేట్ రీచ్ ను సినిమా సొంతం చేసుకోవడం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here