Home న్యూస్ సడెన్ ట్విస్ట్…వెంకీ V వెంకీ…కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది!

సడెన్ ట్విస్ట్…వెంకీ V వెంకీ…కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది!

2272
0

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన తన క్రేజ్ ను అలానే మెయిన్ టైన్ చేస్తూ వస్తుండటం విశేషం, రీసెంట్ హిట్స్ అన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో దుమ్ము లేపగా ఇప్పుడు వరుస పెట్టి సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న విక్టరీ వెంకటేష్… ముందుగా నారప్ప సినిమాను… తర్వాత ఎఫ్ 3 ని కమిట్ అవ్వగా రీసెంట్ గా దృశ్యం 2 సినిమాను ఓకే చేశారు.

కానీ దృశ్యం 2 షూటింగ్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వడం తో ఆ సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతుంది, ఇక ఇప్పుడు వెంకీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓకే అంటే తన సినిమాకి తానే పోటి గా నిలవడానికి సిద్ధం అవ్వగా అసురన్ రీమేక్ నారప్ప మే నెలలో ఆడియన్స్ ముందుకు రావడం కన్ఫాం అంటున్నారు కానీ…

ప్రస్తుతం సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన ఆ సినిమా కొంచం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అదే కనుక జరిగితే ఆ సినిమా ప్లేస్ లో ఇప్పుడు దృశ్యం 2 ని థియేటర్స్ కి దింపే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉందని తెలుస్తుంది. అదేంటంటే… ఒకవేళ నారప్ప థియేటర్స్ లోనే అనుకున్న టైం కి వస్తే…

అదే టైం లో దృశ్యం సీక్వెల్ కి డైరెక్ట్ రిలీజ్ కి సాలిడ్ డీల్ ఏమైనా వస్తే… డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది… దాంతో ఆ సినిమా కూడా నెలలో అన్ని పనులను పూర్తీ చేసి అయితే నారప్ప ప్లేస్ లో థియేటర్స్ లో లేదా ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ రిలీజ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది…

తెలియాల్సి ఉండగా మొత్తం మీద అన్నీ అనుకున్నట్లు జరిగితే మే నెలలో వెంకీ V వెంకీ జరగబోతుంది, అంటే 2 సినిమాలతో వచ్చే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుంది అన్నది పరిస్థితులను బట్టి మారుతుంది అని చెప్పొచ్చు. మరి ఫైనల్ గా మేకర్స్ ఎలాంటి నిర్ణయాలు ఈ 2 సినిమాల విషయం లో తీసుకుంటారో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here