Home గాసిప్స్ బాలయ్య తో కళ్యాణ్ రామ్…ఫ్యాన్స్ రచ్చ చేసే న్యూస్!

బాలయ్య తో కళ్యాణ్ రామ్…ఫ్యాన్స్ రచ్చ చేసే న్యూస్!

494
0

నందమూరి అభిమానులు ఎప్పటి నుండో కోరుకునే కోరికల్లో నందమూరి హీరోలు అందరూ కలిసి సినిమా చేయాలి అని… ఆ కోరిక ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే ఉండగా అభిమానులు జరిగితే బాగుణ్ణు జరిగితే బాగుణ్ణు అను కోరు కుంటూనే ఉన్నారు. ఎట్టకేలకు ఇప్పుడు అందరు హీరోలు కాకున్నా కానీ ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేసే అవకాశం ఎంతైనా ఉందీ అన్నది లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల సారాంశం.

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి తో సినిమా చేస్తుండగా తర్వాత సినిమాల కోసం కథలను బాగానే వింటున్నా ఇంకా ఏది కన్ఫాం కాలేదు అని తెలుస్తుంది. మరో పక్క హీరోగా నిర్మాతగా కూడా సినిమాలు చేసే కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కమిట్ అయిన మూవీసే కాకుండా…

త్వరలోనే హోమ్ బ్యానర్ లో యంగ్ టైగర్ తో సినిమా అలాగే నట సింహం తో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో సంయుక్తంగా హారికా హాసిని వాళ్ళతో కలిసి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాలయ్య తో సినిమా చేయడానికి….

కథ ని కూడా ఫైనల్ చేశారు అని టాక్ వినిపిస్తుంది. తన నిర్మాణంలో బాలయ్య హీరోగా ఓ పక్క ఎంటర్ టైనర్ ని కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించాలని ప్లాన్ లో ఉండగా కథ ఫైనల్ స్టేజ్ కి వచ్చిందని…త్వరలోనే టైం చూసుకుని బాలయ్య కి ఆ కథని వినిపించి ఓకే అంటే అప్పుడు సినిమాను…

అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. దాంతో ఫ్యాన్స్ ఇప్పుడు హోమ్ బ్యానర్ లో ఎన్టీఆర్ తో సినిమా అలాగే బాలయ్య తో సినిమాల వార్త తో పండగ చేసుకుంటున్నారు. అందరూ కలిసి సినిమాలో నటించకున్నా ఓకె నిర్మాణంలో చేసే అవకాశం ఉండటంతో ఫ్యూచర్ లో అయినా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం లేకపోలేదు అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here