లాస్ట్ ఇయరే ఆడియన్స్ ముందుకు రావాల్సిన శివ కార్తికేయన్ నటించిన మూవీ డాక్టర్, ఫస్ట్ వేవ్ అండ్ సెకెండ్ వేవ్ ల వలన ఎదురు దెబ్బ తినగా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సాలిడ్ ఆఫర్స్ వచ్చినా కానీ అన్నింటికీ నో చెప్పారు. ఆల్ మోస్ట్ 42 కోట్ల రేంజ్ రేటు ఆఫర్ వచ్చినా నో చెప్పగా థియేట్రికల్ బిజినెస్ 36.15 కోట్లకు జరిగింది, ఈ మొత్తం రికవరీ చేస్తుందా లేదా అన్న డౌట్ తో…
పరుగు మొదలు పెట్టిన ఈ సినిమా ఓవరాల్ గా ఊహకందని కలెక్షన్స్ తో ఇండియాలో సెకెండ్ వేవ్ తర్వాత 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న మొదటి సినిమాగా సంచలనం సృష్టించింది. ఇక తెలుగు లో సినిమా టోటల్ రన్ లో 4.35 కోట్ల గ్రాస్ ని అందుకోగా….
ఏరియాల వారి షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 69L
👉Ceeded: 38L
👉UA: 39L
👉East: 24L
👉West: 17L
👉Guntur: 23L
👉Krishna: 25L
👉Nellore: 11L
AP-TG Total:- 2.46CR(4.35CR~ Gross)
తెలుగులో సినిమా బిజినెస్ 80లక్షలు కాగా కోటి టార్గెట్ కి ఏకంగా 1.46 కోట్ల ప్రాఫిట్ ను సాధించింది.
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Tamil Nadu : 71.6cr (39.5cr)
Karnataka : 4.02cr (2.10cr)
AP/TS : 4.35cr (2.46cr)
Kerala : 1.58cr (0.75cr)
Rest of India : 1.15cr (0.50cr)
Total India: 82.07CR(45.31Cr)
Overseas – 20.4Cr(9.85Cr)
Total WW: 102.47CR(55.16CR Share)
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క…
42 కోట్ల డైరెక్ట్ రిలీజ్ ఆఫర్ ను వద్దు అనుకుని 36.15 కోట్ల బిజినెస్ ను సాధించి బరిలోకి దిగిన ఈ సినిమా 37 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 18 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సాధించి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా పరుగును ముగించింది. రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా సెన్సేషనల్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని హీరో శివ కార్తికేయన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.