పెళ్లి చూపులుతో క్లాస్ హిట్ ని, అర్జున్ రెడ్డి తో మాస్ హిట్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు గీత గోవిందం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి.
కథ:
ముందుగా స్టోరీలైన్ విషయానికి వస్తే అమ్మాయిలతో అనుకోకుండా కనిపించిన హీరోని చూసి హీరోయిన్ హీరో పై కోపం పెంచుకుంటుంది. కానీ హీరో హీరోయిన్ ని చూసిన వెంటనే ప్రేమిస్తాడు. ఎలా తన ప్రేమని సాధించాడు అన్నది సినిమా కథ.
విశ్లేషణ:
స్టోరీ గా చెప్పడానికి పెద్దగా ఏమి లేకున్నా దర్శకుడు సినిమాను హ్యాండిల్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. లీడ్ పెయిర్ నటన మరియు కెమిస్ట్రీ ఆకట్టుకోగా మిగిలిన నటుల్లో వెన్నల కిషోర్, సుబ్బరాజు, అన్నపూర్ణమ్మ, రాహుల్ రామచంద్రన్ ఆకట్టుకుంటారు. మిగిలిన వాళ్ళు ఒకే అనిపిస్తారు.
స్టోరీ వీక్ గా ఉన్నా స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుని కామెడీ తో ప్రేక్షకుల మనసు గెలిచిన సినిమాల కోవలోకి ఈ సినిమా చేరుతుంది. సంగీతం బాగుంది, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్లు ఉండగా ఎడిటింగ్ సెకెండ్ ఆఫ్ లో మరింత షార్ప్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎక్కడా తగ్గకుండా సినిమాను భారీగానే తెరకెక్కించారు.
డైరెక్షన్:
పరశురాం అనుకున్న స్టోరీ లైన్ వీక్ గానే ఉన్నా ముందు చెప్పినట్లు మంచి స్క్రీన్ ప్లే డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. సెకెండ్ ఆఫ్ స్లో అవుతున్న సమయంలో చివర్లో వచ్చే కామెడీ సీన్స్ ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేసి మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో బయటికి వచ్చేలా చేయడంలో పరశురాం మంచి మార్కులు కొట్టేశాడు.
హైలెట్స్:
విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రజెన్స్ & డైలాగ్స్
రష్మిక
కామెడీ సీన్స్
సంగీతం
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
వీక్ స్టోరీ
సెకెండ్ ఆఫ్ స్లో అవ్వడం
ఫైనల్ గా :
సినిమా ఫ్యామిలీ అండ్ యూత్ ని చాలా వరకు ఆకట్టుకుంది…సినిమా పై రిలీజ్ కి ముందు ఉన్న అంచనాలను నిలబెట్టుకుంది. రొటీన్ మూవీస్ చూసేవారికి, క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీస్ ఇష్టపడేవారికి, యూత్ కి సినిమా ఎక్కువగా నచ్చుతుంది.
TOLLYWOOD2BOLLYWOOD రేటింగ్ : 3.25/5 స్టార్స్
మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి..