Home న్యూస్ 89 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో పుష్ప…చరిత్ర చింపేసిన అల్లు అర్జున్!

89 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో పుష్ప…చరిత్ర చింపేసిన అల్లు అర్జున్!

3392
0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర అల వైకుంఠ పురం లో సినిమా తో సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని ఓ రేంజ్ లో సొంతం చేసుకుని పోటి లో కూడా చారిత్రిక రికార్డ్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ ఆడియన్స్ ముందుకు కంప్లీట్ గా డిఫెరెంట్ జానర్ లో తీస్తున్న పుష్ప తో…

అతి త్వరలో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పాన్ ఇండియా లెవల్ లో అత్యంత భారీ ఎత్తున సందడి చేయడం ఖాయమని అంతా నమ్ముతున్నారు. సినిమా పై ఉన్న అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉండటం తో… కచ్చితంగా రాంపేజ్ మరో లెవల్ లో…

ఉండే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. సినిమా ఇంట్రో టీసర్ ఎప్పుడో ఆడియన్స్ ముందుకు వచ్చి ప్రీవియస్ రికార్డులను అన్నీ బ్రేక్ చేసి ఇండియన్ టీసర్స్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా కూడా నిలిచి దుమ్ము లేపిన విషయం అందరికీ తెలిసిందే…

దాంతో పాటు ఇప్పుడు టాలీవుడ్ తరపున ఆల్ టైం హైయెస్ట్ లైక్స్ ని కూడా సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచిన ఈ టీసర్ రీసెంట్ గా 2 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ టీసర్ కూడా ఈ రేంజ్ లో భీభత్సం సృష్టించలేదు… కానీ పుష్ప ఏకంగా ఫస్ట్ టైం 2 మిలియన్…

లైక్స్ మార్క్ ని అందుకుని 89 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక సినిమా టీసర్ 2 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుని చరిత్ర పుటల్లో నిలిచింది అని చెప్పాలి. ఈ రికార్డ్ లైక్స్ తో మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్న పుష్ప అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అతి త్వరలోనే ఉండబోతుంది అని చెబుతూ ఉండగా ట్రైలర్ తో ఎలాంటి సంచలనాలు నమోదు అవుతాయో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here