వేసిన సినిమాలే వేసి వేసి బోర్ కొడుతుందేమో మన ఛానెల్స్ ఈ మధ్య ఇతర భాషల సినిమాలను ఇక్కడ డబ్ చేసి ఉన్నవి లేదా పాత సినిమాల శాటిలైట్ రైట్స్ ఎవ్వరూ కొననివి ఇప్పుడు కొంటూ టెలివిజన్ లో మినిమమ్ పబ్లిసిటీ చేస్తూ వాటిని టెలికాస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంటున్నారు, రీసెంట్ గా ఈ పద్దతిని స్టార్ మా ఎక్కువగా వాడుకుని మంచి ప్రాఫిట్స్ ని సొంతం చేసుకోగా…
ఇప్పుడు జెమినీ టీవీ కూడా రేసులో ఎంటర్ అయింది, తమిళ్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శివ కార్తికేయన్ అనూ ఎమాన్యుయేల్ మరియు ఐశ్వర్య రాజేష్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన నమ్మ వేట్టు పిళ్ళై సినిమాను తెలుగు లో…
రీసెంట్ గా మనసున్నోడు పేరుతో డబ్ చేసి పర్వాలేదు అనిపించే విధంగా పబ్లిసిటీ చేయగా సినిమా ను టెలికాస్ట్ చేశాక సాలిడ్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, సినిమా ను కొన్న రేటు ప్రకారం చూసుకుంటే తెలుగులో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పొచ్చు.
సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ని కేవలం 45 లక్షల రేంజ్ లోనే సొంతం చేసుకున్న జెమినీ టీవీ రీసెంట్ గా సినిమాను టెలికాస్ట్ చేయగా సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ చేసినప్పుడు 4.65 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని లాస్ట్ వీక్ టెలికాస్ట్ చేసిన సినిమాలలో రెండో ప్లేస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
మినిమమ్ పబ్లిసిటీ తోనే సినిమా కి సాలిడ్ రిజల్ట్ దక్కింది అని చెప్పాలి, ముందే చెప్పినట్లు సినిమాను కొన్న రేటు ప్రకారం చూసుకుంటే సినిమా తెలుగు లో బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు, మొదటి సారే లాభాలు తెచ్చి పెట్టిన సినిమా తర్వాత టెలికాస్ట్ నుండి మరిన్ని లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమని చెప్పొచ్చు.