Home న్యూస్ 24 గంటలు ఓవర్…రికార్డ్ ముక్క మిగల్లేదు!

24 గంటలు ఓవర్…రికార్డ్ ముక్క మిగల్లేదు!

894
1

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో వీరంగం సృష్టించారు, మహేష్ 44 వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఆగస్ట్ 8 న సాయంత్రం 6 గంటల నుండి ట్విట్టర్ లో భారీ ఎత్తున ట్రెండ్ ని మొదలు పెట్టగా ఆగస్ట్ 9 సాయంత్రం 6 గంటల సమయానికి ఏకంగా 8.3 మిలియన్ ట్వీట్స్ తో ఆల్ టైం రికార్డ్ లెవల్ బర్త్ డే ట్రెండ్ ని ఇండియా సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో…

లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పోల్ అయిన 7.4 మిలియన్ రికార్డ్ ను 0.9 మిలియన్ తేడా తో బ్రేక్ చేసి సంచలనం సృష్టించారు. ఒకసారి టాప్ 5 బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ లను గమనిస్తే..
#HappyBirthdaySSMB – 8.3M
#HBDJanaSenaniPawankalyan : 7.4M
#HBDSuperstarMAHESH : 4.5M
#HappyBirthdayPrabhas : 4.2M
#HBDEminentVijay – 3.03M

ఇందులో టాప్ 4 మన టాలీవుడ్ హీరోలవి అవ్వడం విశేషం అయితే అందులో కూడా 2 కేవలం మహేష్ పేరిటే ఉండటం మరో విశేషం అని చెప్పొచ్చు. ఇక ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి ఈ ఇయర్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అలాగే ప్రభాస్ పుట్టిన రోజులకు చాన్స్ ఉంది, మరి ఎవరు ఈ రికార్డ్ బ్రేక్ చేస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here