చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో, అను ఎమాన్యుయల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టీసర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత యూత్ లో మంచి అంచనాలనే పెంచింది, దానికి తగ్గట్లు యూనిట్ సినిమాను బాగా ప్రమోట్ కూడా చేశారు, మరి ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుని మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….
మిడిల్ క్లాస్ వ్యక్తీ అయిన హీరో ఫారన్ లో పుట్టిన హీరోయిన్ ఒకే ఆఫీస్ లో పని చేస్తూ ఉంటారు, హీరోయిన్ ని చూసి ఇష్టపడే హీరో తన లవ్ చేస్తున్న హీరోయిన్ అలాంటివి పట్టించుకోదు, తర్వాత ఏం జరిగింది, వీళ్ళు ఎలా ఏకం అయ్యారు అన్నది ఓవరాల్ గా స్టొరీ పాయింట్…. పెర్ఫార్మెన్స్ పరంగా అల్లు శిరీష్ పర్వాలేదు అనిపించగా… అను ఎమాన్యుయల్ అటు గ్లామర్ పరంగా స్క్రీన్ ప్రజెన్స్ పరంగా బాగా మెప్పించింది…
మిగిలిన యాక్టర్స్ లో వెన్నెల కిషోర్ కామెడీ బాగా వర్కౌట్ అవ్వగా మిగిలిన యాక్టర్స్ అందరూ బాగా నటించారు, సాంగ్స్ ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ బిలో యావరేజ్ గా ఉంది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పర్వాలేదు, సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పిస్తాయి. డైరెక్షన్ విషయానికి వస్తే రాకేశ్ శశి కథ పరంగా పెద్దగా కొత్తదనం ఏమి లేకున్నా కానీ….
సీన్ బై సీన్ స్క్రీన్ ప్లే చాలా వరకు ఆకట్టునేలా రాసుకోగా కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది, యూత్ ని టార్గెట్ చేసి తీసిన సీన్స్ వాళ్ళకి బాగానే నచ్చే అవకాశం ఉండగా ఓవరాల్ గా స్లో నరేషన్ వలన సినిమా అక్కడక్కడా బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది, అలాగే మెయిన్ స్టొరీ పాయింట్ లో పెద్దగా కొత్తదనం ఏమి లేదు…. అయినా కానీ కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వడం.
యూత్ ని టార్గెట్ చేసి తీసిన సీన్స్ వాళ్ళకి నచ్చే చాన్స్ ఎక్కువగా ఉండగా ఫ్యామిలీతో సినిమా చూడటం కష్టమే అని చెప్పాలి. మొత్తం మీద యూత్ కి సినిమా ఓవరాల్ గా నచ్చే అవకాశం ఉంది, రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా కొంచం ఓపిక తో చూస్తె సినిమా ఎబో యావరేజ్ లెవల్ లో మెప్పించే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా ఫైనల్ గా మా రేటింగ్ 2.75 స్టార్స్…