Home న్యూస్ “వి” టీసర్ – “భీష్మ” ట్రైలర్ 24 గంటల వ్యూస్ అండ్ లైక్స్ ఇవే!!

“వి” టీసర్ – “భీష్మ” ట్రైలర్ 24 గంటల వ్యూస్ అండ్ లైక్స్ ఇవే!!

1063
0

     టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో ఇద్దరు హీరోల సినిమాల టీసర్ అండ్ ట్రైలర్ అప్ డేట్స్ నిన్న జరిగాయి. ముందు వస్తుంది అనుకున్న నితిన్ భీష్మ ట్రైలర్ కొద్దిగా ఆలస్యంగా రాగా… వి మూవీ టీసర్ మాత్రం అనుకున్న సమయానికే వచ్చేసింది, రెండు సినిమాల కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కుతుందని చెప్పొచ్చు. నాని సుదీర్ బాబు ల వి సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపధ్యంలో ఆడియన్స్ ని…

బాగా మెప్పించింది, ముఖ్యంగా నాని షాకింగ్ విలనిజం గ్లిమ్స్ ఇప్పటి నుండే సినిమా పై అంచనాలను పెంచేసిందని చెప్పాలి. ఇక నితిన్ భీష్మ ట్రైలర్ అటు ఎంటర్ టైన్ మెంట్ కి తోడూ యాక్షన్ పాళ్ళు కూడా సాలిడ్ గా ఉన్నాయని ట్రైలర్ లో కన్ఫాం అయింది.

ఇక రెండు సినిమాల టీసర్ అండ్ ట్రైలర్ 24 గంటల రెస్పాన్స్ ని గమనిస్తే ముందుగా నాని సుదీర్ బాబు ల వి సినిమా టీసర్ 24 గంటలు పూర్తీ అయ్యే సరికి యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ 3.85 మిలియన్ మార్క్ ని అందుకోగా లైక్స్ 1 లక్షా 81 వేల వరకు వచ్చాయి.

ఇవి మరీ రికార్డ్ అని కాదు కానీ ఉన్నంతలో బాగానే వచ్చాయి. ఇక భీష్మ ట్రైలర్ కి 24 గంటలు పూర్తీ అయ్యే సరికి యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ 3.64 మిలియన్ మార్క్ ని అందుకోగా లైక్స్ మాత్రం 1 లక్షా 39 వేలు మాత్రమె దక్కాయి. ఓవరాల్ గా ఇటు వి టీసర్ కానీ భీష్మ ట్రైలర్ కానీ..

మీడియం రేంజ్ మూవీస్ లో సరికొత్త రికార్డులు ఏవి నమోదు చేయలేదు, మీడియం రేంజ్ హీరోల్లో టీసర్ పరంగా వరల్డ్ ఫేమస్ లవర్ టాప్ లో ఉండగా ట్రైలర్ పరంగా ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ టాప్ లో ఉంది. మొత్తం మీద భీష్మ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుండగా వి సినిమా సమ్మర్ కానుకగా మార్చి 25 న రాబోతుంది.

avatar
  Subscribe  
Notify of