యాత్ర టార్గెట్ ఇదే…టాక్ వస్తే దంచికొట్టుడే!

0
574

    స్వర్గీయ యై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణం లో సాగిన పాద యాత్ర నేపధ్యం లో కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ బయోపిక్ కానీ బయోపిక్ యాత్ర ప్రేక్షకుల ముందుకు ఈ శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సుమారు 950 వరకు థియేటర్స్ లో భారీ గా రిలీజ్ ని సొంతం చేసుకో బోతుండగా…

ఓవరాల్ గా సినిమా ప్రపంచ వ్యాప్తంగా దక్కించుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారిగా రిలీజ్ అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా ఉంది. Nizam: 3.3 Cr Ceded: 2.2 Cr Andhra: 5.5 Cr Total AP TG 11 Cr Rest of India: 0.40 Cr Overseas: 2 Cr Total WW : 13.40Cr.

ఇదీ సినిమా టోటల్ తెలుగు వర్షన్ కి గాను సాధించిన బిజినెస్. ఇక సినిమా మలయాళ వర్షన్ ని ఓన్ గా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. దాంతో అక్కడ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నా అది నిర్మాతలకే చెల్లుతుందని సమాచారం. ఇక…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకున్న యాత్ర సినిమా భారీ గానే రిలీజ్ అవుతుండటం తో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ 14.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి.

ఒక్క సారి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే కచ్చితంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడం ఖాయమని చెప్పొచ్చు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ టార్గెట్ ని అందుకుంటుందో కొన్ని రోజుల్లో తేలిపోతుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!