Home న్యూస్ యాత్ర బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ప్రిడిక్షన్స్…షాకింగ్ అప్ డేట్!

యాత్ర బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ప్రిడిక్షన్స్…షాకింగ్ అప్ డేట్!

583
0

     స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ లైఫ్ లో జరిగిన పాద యాత్ర ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యాత్ర. మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి YSR పాత్రలో నటిస్తుండగా సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ ట్రైలర్ కి కూడా పాజిటివ్ బజ్ ఏర్పడటం తో సినిమాను 950 కి వరకు థియేటర్స్ లో సుమారు 13.4 కోట్ల…

బిజినెస్ ని దక్కించు కుని 14.4 కోట్ల రేంజ్ టార్గెట్ తో రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఓవరాల్ గా సినిమా కి ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఒకింత నిరాశనే మిగిలించాయి అని చెప్పాలి. అన్ని చోట్లా బుకింగ్స్ ఓపెన్ అయినా కానీ ఆన్ లైన్ బుకింగ్స్ జోరు గా లేవనే చెప్పాలి.

అన్ సీజన్ మొదలు అవ్వడం సినిమా బయోపిక్ అవ్వడం కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడం తో బుకింగ్స్ లో జోరు చూపలేక పోతుంది ఈ సినిమా. దాంతో ఇప్పుడు సినిమా మౌత్ టాక్ పైనే ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంది అని చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్…

మొత్తం మీద కేవలం 5% వరకు మాత్రమె జరగగా మొదటి షో సమయానికి 10% ని టచ్ చేసే అవకాశం ఉంది, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా షో సమయానికి గాని జోరు అందుకునే అవకాశం కనిపించడం లేదు. దాంతో ఇప్పుడు సినిమా ప్రస్తుత బుకింగ్స్ ని బట్టి మొదటి రోజు…

బాక్స్ ఆఫీస్ దగ్గర సుమారు 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉంది. ఒకవేళ టాక్ బాగుంది సినిమా గ్రోత్ షో షో కి ఇంప్రూవ్ అయితే ఈ లెక్క 1 కోటి కి అటూ ఇటూ గా పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here