Home న్యూస్ ఏం కాంబినేషన్ సామి ఇది….మాస్ రచ్చ ఖాయం!!

ఏం కాంబినేషన్ సామి ఇది….మాస్ రచ్చ ఖాయం!!

1588
0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున డిసెంబర్ 2న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 27న ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఈవెంట్ కి ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వస్తున్నారన్న వార్తలు వచ్చాయి కానీ అవి ఇప్పుడు…

రూమర్స్ అని తేలగా ఈ ఈవెంట్ లో ఇక స్పెషల్ గెస్టులు ఎవరూ ఉండరేమో అనుకున్నారు కానీ అసలు ఎవ్వరి ఊహలకు కూడా అందని విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

బాలయ్య మరియు అల్లు అర్జున్ ఓకే స్టేజ్ పై ఇప్పటి వరకు ఏ ఈవెంట్ లో కూడా కనిపించి ఉండరు. బోయపాటి శ్రీను ఇద్దరు హీరోలతో కలిసి పని చేయడం బాలయ్య ఆహా వీడియోలో అన్ స్టాపబుల్ చేస్తూ ఉండటంతో ఈ కలయిక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిజం కానుంది… దాంతో ఈ ఈవెంట్ కోసం ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here