Home న్యూస్ నైజాంలో సాహో ఊచకోత…ఫస్ట్ డే ఇండస్ట్రీ రికార్డ్ బద్దలు!!

నైజాంలో సాహో ఊచకోత…ఫస్ట్ డే ఇండస్ట్రీ రికార్డ్ బద్దలు!!

1159
0

     యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని లెవల్ లో ఫస్ట్ డే అల్టిమేట్ కలెక్షన్స్ ని అన్ని ఏరియాల్లో సాధిస్తూ దూసుకు పోతుంది, సినిమా ఒక్కో ఏరియా కలెక్షన్స్ రిలీజ్ అవుతూ వస్తుండగా గుంటూరు లో 4.7 కోట్లు, వైజాగ్ లో 3.77 కోట్లు, కృష్ణా 2.51 కోట్ల నాన్ బాహుబలి రికార్డ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా మిగిలిన ఏరియాల కలెక్షన్స్ తెలియాల్సి ఉంది.

ఇక సీడెడ్ ఏరియాలో కూడా రికార్డ్ లెవల్ కలెక్షన్స్ పక్కా అంటున్నారు, కానీ నైజాం ఏరియా లో మాత్రం ఊహకందని కలెక్షన్స్ రికార్డు ను నమోదు చేసింది ఈ సినిమా ఇది వరకు ఇక్కడ బాహుబలి 2 8.9 కోట్ల షేర్ తో హైయెస్ట్ రికార్డ్ ను అందుకోగా… బాహుబలి తర్వాత ప్లేస్ లో…

మహర్షి సినిమా 6.38 కోట్ల షేర్ తో నాన్ బాహుబలి హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమా గా నిలిచింది, కాగా ఇప్పుడు ప్రభాస్ సాహో దెబ్బకి అన్ని రికార్డులు బద్దలు అవ్వగా మొదటి రోజు అందరి అంచనాలను మించి సినిమా ఏకంగా 9.41 కోట్లకు పైగా షేర్ ని ఇక్కడ అందుకుని..

బాహుబలి సిరిస్ అలాగే నాన్ బాహుబలి రికార్డ్ అయిన మహర్షి సినిమాలను క్రాస్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ ని నైజాం ఏరియా లో మొదటి రోజు కి గాను సాధించి ఊచకోత కోసింది. ఇక మిగిలిన ఏరియాల్లో కూడా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సాహో సినిమా ఆల్ టైం రికార్డులను నమోదు చేసే అవకాశం ఉండటం…

కచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు హిస్టారికల్ రికార్డులు నమోదు అయ్యే అవకాశం ఉందని సమాచారం, ఇక కొన్ని సెంటర్స్ లో హైర్స్ కూడా యాడ్ అవ్వాల్సి ఉండగా ఫైనల్ గా సినిమా ఫస్ట్ డే టోటల్ గా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here