F2 ప్రీమియర్ షో…రివ్యూ..హిట్టా…ఫ్లాఫా

0
546

     విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర నేడు భారీ గా రిలీజ్ అవ్వగా సినిమా ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ షోల ని కంప్లీట్ చేసుకుని మొదటి టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. ఆ టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ.. స్టొరీ పాయింట్ వెంకీ కి తమన్నా తో అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది.

కానీ తర్వాత ఇద్దరి లైఫ్ లో సమస్యలు వస్తుండగా ఆ ఫ్యామిలీ లో పెళ్లి వద్దని వరుణ్ కి చెప్పినా వినక పెళ్లి చేసుకోగా తర్వాత ఇద్దరికీ ఒక రకమైన సమస్య వచ్చినప్పుడు హీరోలు ఎం చేశారు అన్నది స్టొరీ పాయింట్. అని రావిపూడి కామెడి మూవీస్ కి పెట్టింది పేరు.

ఈ సారి కూడా ఎలాంటి కొత్త కథ ల జోలి కి పోకుండా కామెడీ నే నమ్ముకుని చిన్న పాయింట్ తో కామెడి సీన్స్ ని పేర్చుకుంటూ సినిమా ని తెరకెక్కించాడట. సినిమా మొత్తం వెంకీ వన్ మ్యాన్ శో అయిందని, ఇతర పాత్రలను పూర్తీ డామినేట్ చేస్తూ ఒకప్పటి వెంకటేశ్ కామెడి…

మూవీస్ ని మరిపిస్తూ ఫస్టాఫ్ అండ్ సెకెండ్ ఆఫ్ లో కుమ్మేశాడు అని అంటున్నారు, వరుణ్ తేజ్ జస్ట్ ఓకే అనిపించుకోగా హీరోయిన్స్ కొంతవరకు ఆకట్టుకున్నారని, సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి తగ్గట్లు ఉన్నాయని అంటున్నారు.

మొత్తం మీద ఫస్టాఫ్ సరదా సరదా గా సాగగా సెకెండ్ ఆఫ్ మాత్రం కొంచం డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగినా ఓవరాల్ గా మంచి సినిమా నే అని చెబుతున్నారు ఓవర్సీస్ ఆడియన్స్, ఇక ఇదే రేంజ్ టాక్ ని కామన్ ఆడియన్స్ నుండి కూడా సొంతం చేసుకుంటే సినిమా దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!