లాస్ట్ ఇయర్ సమ్మర్ లో దసరా(Dasara Movie) తో కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) ఇయర్ ఎండ్ లో అల్ట్రా క్లాస్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) తో ఆడియన్స్ ముందుకు రాగా సినిమా ఓపెనింగ్స్ చాలా స్లో గా మొదలైనా కూడా సినిమాకి ఆడియన్స్ నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్…
సొంతం అవ్వడంతో ఆ అడ్వాంటేజ్ తో స్టడీగా లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న హాయ్ నాన్న పరుగు కంప్లీట్ అయ్యే టైంలో కొంచం డౌట్ అనుకున్న బ్రేక్ ఈవెన్ ని అందుకోవడమే కాదు….బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద మంచి లాభాలను కూడా సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకోవడం విశేషం అని చెప్పాలి…
ఒకసారి సినిమా టోటల్ రన్ లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Hi Nanna Movie Total WW Collections Report(INC GST)
👉Nizam: 12.80Cr
👉Ceeded: 2.68Cr
👉UA: 2.58Cr
👉East: 1.40Cr
👉West: 87L
👉Guntur: 1.37Cr
👉Krishna: 1.35Cr
👉Nellore: 65L
AP-TG Total:- 23.70CR(43.15CR~ Gross)
👉KA+ROI: 5.60Cr~(INC ALL)
👉OS: 9.30Cr~
Total WW Collections – 38.60CR(74.40CR~ Gross)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 27.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా 28.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. రన్ కంప్లీట్ అయ్యే టైంకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 10.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా రన్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా…
మొత్తం మీద చూసుకుంటే సినిమా స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అయ్యి బ్రేక్ ఈవెన్ ని టచ్ అండ్ గో చేసినా గొప్పే అనుకున్న స్టేజ్ నుండి పాజిటివ్ టాక్ పవర్ తో లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ మీద 10 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని బాక్ టు బాక్ హిట్స్ తో ఇయర్ ని గ్రాండ్ గా నానికి కంప్లీట్ చేసుకునేలా చేసింది.