Home న్యూస్ మెంటల్ మాస్ రికార్డ్….అసలు రచ్చ ఇప్పుడు మొదలు!!

మెంటల్ మాస్ రికార్డ్….అసలు రచ్చ ఇప్పుడు మొదలు!!

872
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తమ ఓన్ రికార్డులను తామే బ్రేక్ చేసుకుంటూ సరికొత్త బెంచ్ మార్కులను ఇప్పుడు సెట్ చేస్తూ దూసుకు పోతున్నారు. ట్విట్టర్ ట్రెండ్స్ విషయం లో పీక్ స్టేజ్ కి చేరుకున్న టాలీవుడ్ మిగిలిన ఇండస్ట్రీలు టచ్ కూడా చేయని స్టేజ్ కి వచ్చేశాయి. అందులో భాగంగా ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కొత్త రికార్డులతో బాక్ టు బాక్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఇండియా లోనే బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ విషయం లో కొత్త రికార్డులను నమోదు చేసి దుమ్ము దుమారం చేసిన మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు ఇండియా లోనే బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసి ఆల్ టైం న్యూ రికార్డ్ ను నమోదు చేసి సత్తా చాటుకున్నారు.

ఇది వరకు ఈ రికార్డ్ ను మహేష్ బర్త్ డే CDP ట్రెండ్ లో నమోదు చేస్తూ తొలి 30 మిలియన్ ట్రెండ్ రికార్డ్ ను నమోదు చేయగా 24 గంటల్లో 31.1 మిలియన్ ట్వీట్స్ తో దుమ్ము దుమారం చేయగా ఇప్పుడు ఆ రికార్డ్ ను ఇంకా చాలా టైం ఉండగానే…

బ్రేక్ చేసి దుమ్ము లేపారు మహేష్ ఫ్యాన్స్. ఇప్పటికి 33 మిలియన్ మార్క్ ని కూడా క్రాస్ చేసి తమ ఓన్ రికార్డులను తామే బ్రేక్ చేసుకుని కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్న మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు ఇండియన్ రికార్డులు బ్రేక్ చేసిన తర్వాత ఇప్పుడు వరల్డ్ రికార్డుల పై గురి పెట్టారు.

వరల్డ్ రికార్డ్ ట్రెండ్ నమోదు చేయాలి అంటే 60.1 మిలియన్ రేంజ్ లో ట్వీట్స్ ని వేస్తె వరల్డ్ రికార్డ్ ట్రెండ్ ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ సొంతం అవుతుంది. అంటే ఇప్పటి వరకు చూపిన జోరు కన్నా ఇప్పుడు రెట్టింపు జోరు చూపితే ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here