Home న్యూస్ ఎన్టీఆర్ 4…మహేష్ బాబు 4…ఎవ్వరూ తగ్గట్లేదు!

ఎన్టీఆర్ 4…మహేష్ బాబు 4…ఎవ్వరూ తగ్గట్లేదు!

837
0

రీసెంట్ గా సోషల్ మీడియా లో మన హీరోల కి ఓ రేంజ్ లో రీచ్ పెరుగుతూ పోతుంది. ఇది వరకటితో పోల్చితే ఫ్యాన్స్ ఎక్కువ ట్రెండ్స్ లాంటివి చేస్తూ ఉండటం తో హీరోల అఫీషియల్ హ్యాండిల్ నుండి వస్తున్న ట్వీట్స్ కి రెస్పాన్స్ కూడా భారీ గా పెరిగి పోతుంది. టాలీవుడ్ స్టార్ హీరోల్లో సోషల్ మీడియా లో కొంచం ఎక్కువ యాక్టివ్ గా ఉండే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి.

అందుకే మహేష్ కి అందరి కన్నా ఎక్కువగా 10 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ట్విట్టర్ లో ఉండగా తనకి నచ్చిన ప్రతీ అంశాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటారు మహేష్. ఇక ఎప్పుడో కానీ ఎదో ఒక ఇంపార్టేంట్ అప్ డేట్ ఉంటేనే అప్ డేట్ చేసే హీరో ఎన్టీఆర్ అని చెప్పాలి.

అయినా కానీ ఎన్టీఆర్ వేసిన ట్వీట్ మొదటగా 1 లక్ష లైక్స్ ని అందుకుని రికార్డ్ అందుకోగా తర్వాత క్రమంగా ఇతర హీరోలకు కూడా ఈ రికార్డ్ దక్కింది. ఓవరాల్ గా ఇప్పుడు ఈ 1 లక్ష లైక్స్ లీగ్ లో నిన్నటి వరకు ఎన్టీఆర్ 4 సార్లు ఈ రికార్డ్ అందుకుని లీడ్…

లో ఉండగా ఇప్పుడు మహేష్ మరోసారి సమం చేశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన మహేష్ సర్కారు వారి పాట ప్రీ లుక్ 1 లక్ష లైక్స్ ని అందుకున్న మొట్టమొదటి ప్రీ లుక్/టైటిల్ గా నిలిచి రికార్డ్ సృష్టించగా ఆ ట్వీట్ 1 లక్ష లైక్స్ ని అందుకోగా మహేష్ కౌంట్ కూడా ఇప్పుడు 4 కి చేరింది. దాంతో ఎన్టీఆర్ 4 మరియు మహేష్ 4 ఒక లక్ష లైక్స్ తో సమంగా నిలిచారు.

ఒకసారి టాప్ లిస్టును గమనిస్త….
👉#NTR – 4 Times
👉#MaheshBabu – 4 Times
👉#PawanKalyan – 2 Times
👉#RanaDaggubati – 2 Times
👉#AlluArjun – 1 Time
👉#RamCharan – 1 Time
ఎన్టీఆర్ 4 మహేష్ 4 తో ఉండగా పవన్ కళ్యాణ్ 2 రానా 2 సార్లు 1 లక్ష లైక్స్ తో ఉన్నారు, ఇక అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ లు చేరోక్క సారి ఈ మార్క్ ని అందుకున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here