Home న్యూస్ కొన్ని గంటల్లో సూపర్ స్టార్ రచ్చ…..బ్రేక్ చేయాల్సిన టార్గెట్స్ ఇవే!

కొన్ని గంటల్లో సూపర్ స్టార్ రచ్చ…..బ్రేక్ చేయాల్సిన టార్గెట్స్ ఇవే!

2288
0

కొన్ని గంటల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ సర్కారు వారి పాట సినిమాలో బ్లాస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ స్పెషల్ టీసర్ లేదా గ్లిమ్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్తర్ హిట్ తర్వాత మహేష్ నుండి వస్తున్న ఈ సినిమా అవ్వడం డైరెక్టర్ పరుశురామ్ పేట్లా…

వరుస హిట్స్ తో ఉండటం కూడా సినిమా పై హైప్ ను ఓ రేంజ్ లో పెంచింది. వచ్చే సంక్రాంతి కి బరిలోకి దిగబోతున్న ఈ సినిమా లోని ఫస్ట్ గ్లిమ్స్ టీసర్ ను మహేష్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ కాబోతుండటంతో ఈ వీడియో తో టాలీవుడ్ లో…

టీసర్ రికార్డులను బ్రేక్ చేయాలనీ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టీసర్ ల పరంగా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ ను సొంతం చేసుకున్న టీసర్ గా అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప సినిమా ఇంట్రో టీసర్ నిలిచింది… ఆ టీసర్…

24 గంటల్లో 22.52 మిలియన్స్ అప్ డేటెడ్ వ్యూస్ ను దక్కించుకుని రికార్డ్ కొట్టగా 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ రికార్డ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ పేరిట ఉంది. ఆ టీసర్ 24 గంటల్లో 940.3K లైక్స్ ను సాధించి రికార్డ్ కొట్టింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ 24 గంటల్లో ఈ రికార్డులను బ్రేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

సోషల్ మీడియా లో ఆల్ రెడీ సినిమా టీసర్/గ్లిమ్స్ టార్గెట్స్ చక్కర్లు కొడుతూ ఉండగా ఫ్యాన్స్ కొత్త రికార్డులను బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి సూపర్ స్టార్ ఫ్యాన్స్ సర్కారు వారి పాట టీసర్ గ్లిమ్స్ తో టాలీవుడ్ టీసర్ రికార్డులను బ్రేక్ చేస్తారో లేదో చూడాలి… మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here